Maha Shivaratri: సాక్షాత్తు భోళాశంకరుడి విశిష్ట మహాశివరాత్రి కథ ఇది..
Maha Shivaratri 2022: ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో పీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, భోళాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలవబడుతూ.. ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మరి ఈ పరమేశ్వరుడికి ఇష్టమైన మహా శివరాత్రి వెనకున్న అంతర్యం గురించి ఎంత మందికి తెలుసు.

Maha Shivaratri 2022: అభిషేక ప్రియుడు, రాజేశ్వరుడు, భోళా శంకరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు.. ఇలా ఎన్నో పేర్లతో పిలిపించుకుంటూ ఈ సమస్త జగత్తును పాలిస్తున్నాడు ఆ పరమేశ్వరు. కోరిన వరాలను ప్రసాదిస్తూ.. ఈ జగత్తుచే ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి మార్చి 1 తారీఖున వచ్చింది. ఆ రోజున శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష మాలలు, బిల్వపత్రాలు, రుద్రుభిషేకాలతో, విభూతి ధారణలతో ఆ శివుడిని పూజిస్తాం. అయితే ఈ మహశివరాత్రి జరుపుకోవడానికి అసలు కారణాలు ఏంటో పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. అయితే లింగపురాణంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతిమాతకు ఈ మహాశివరాత్రి కథ చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్వం ఓ బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించే వాడు. ఈ బోయవాడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి జంతువులను చంపి తెచ్చేవాడు. కానీ ఒకరోజు మాత్రం అతనికి వేటలో ఏ జంతుకు లభించలేదు. దాంతో అతను నిరశగా అతని ఇంటి వైపు బయలుదేరగా.. అతనికి మార్గం మధ్యలో ఒక మంచి నీటి సరస్సు కనిపించింది. దాంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సరస్సు దగ్గరకి రాత్రి సమయంలో జంతువులు వస్తాయని, అప్పుడు దాన్ని పట్టుకోవచ్చని భావిస్తాడు. కాగా ఆ రాత్రి ఆ భోయవాడు ఆ సరస్సు పక్కనుండే ఒక చెట్టుపై జంతువులకోసం కాచుకుని కూర్చుంటాడు.
అయితే అతనికి శివ శివ అంటూ శివుడి పేరును పలకడం బాగా అలవాటు. ఆ రాత్రంగా ఆ చెట్టుపై కూర్చొని అతను శివుడి నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ రోజే శివరాత్రి. అది ఆ బోయవాడికి తెలియదు. ఇక ఆ సమయంలోనే ఆ సరస్సు దగ్గరికి నీళ్లు తాగేందుకు ఒక జింక వస్తుంది. దాన్ని చూసిన ఆ భోయవాడు దానికి బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ విషయాన్ని గమనించిన జింక ‘నేను గర్భంతో ఉన్నానని.. నన్ను చంపడం ఆధర్మమంటూ’ అతన్ని వేడుకుంది. ఒక జింక మనిషిలా మాట్లాడటం ఏంటని ఆ భోయవాడు ఆ జింకు చంపకుండా వదిలేసాడు. అది వెళ్లిపోగానే ఆ సరస్సు దగ్గరికి మరో ఆడ జింక వచ్చింది. ఈ సారి దీన్ని చంపాలనుకున్న భోయవాడు దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. దాన్ని గమనించిన ఆ జింక ‘నేను నా భర్తను వెతకాడానికి ఇటుగా వచ్చాను, అయినా నేను బక్క చిక్కిన శరీరంతో ఉన్నాను.. నన్ను చంపినా నీ కుటుంబం ఆకలి తీరదు’అని అది కూడా మనిషి మాట్లాడినట్టుగానే మాట్లాడింది. అంతేకాదు అతనికి కొంతసేపటి తర్వాత ఏ జంతువు కనిపించకపోతే తిరిగి తనే వస్తానని చెప్పింది. దాంతో అతను ఆశ్చర్యపోయి దాన్ని కూడా వదిలేశాడు.
అలా చాలా సేపు సరస్సు దగ్గర కూర్చున్న అతనికి ఒక మగ జింక కనిపించింది. ఆ మగ జింక ఇటేమైన రెండు ఆడ జింకలు వచ్చాయా అని ఆ భోయవాడిని అడిగింది. దాంతో అతను ఆ జింక తనతో చెప్పిన సంభాషణ అంతా వివరిస్తాడు. దానికి ఆ మగజింక వాటిని నేను ఒక సారి చూసుకొని నీ దగ్గరికి నేనొస్తానని చెప్పి వెళ్తుంది. దాంతో ఆ భోయవాడు అక్కడే కాచుకొని చూస్తుంటాడు. తెల్లవారు జామున అటుగా ఒక జింక, దాని పిల్ల రావడాన్ని ఆ భోయవాడు గమనిస్తాడు. దాంతో ఆ భోయవాడు తెగ సంతోషపడిపోయి.. వాటిని చంపడానికి బాణాన్ని ఎక్కుపెడతాడు. దాన్ని గమనించిన తల్లి జింక తన పిల్లలను వదిలేయమని, నేను దాన్ని ఇంటికాడ వదిలేసి వస్తానని చెప్పి అక్కడినుంచి వెళుతుంది.
ఇచ్చిన మాట ప్రకారం ఆ భోయవాడి దగ్గరికి నాలుగు జింకలు ఒకేసారి వచ్చి నిల్చుంటాయి. నన్ను చంపు అంటే ముందుగా నన్ను చంపు అని ఆ నాలుగు జింకలు భోయవాడిని వేడుకుంటాయి. ఆ జింకలు సత్యవర్తనను చూసిన భోయవాడు ఆశ్చర్యపోతాడు. అంతేకాదు అవి అతనిలో మార్పును తీసుకొస్తాయి. జంతువులకోసం కాచుకుని ఉన్న ఆ భోయవాడు ఆ రాత్రంగా మారెడు చెట్టుకిందే కూర్చొని ఉంటాడు. అందులోనూ ఆ రాత్రంతా శివ శివ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూనే ఉంటాడు. అందులోనూ తన చూపుకు అడ్డంగా వస్తున్న మారెడు దళాలను కోసి కిందపడేస్తుంటాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది. అతడు కిందపోసిన మారెడు దళాలన్నీ శివలింగం పైనే అభిషేకంలా పడుతుంటాయి.
ఆ మారెడు దళం అతనికి శివ పూజా ఫలితాన్ని ఇచ్చింది. ఆ రాత్రంగా భోయవాడు శివ శివ అంటూ మారెడు దళాలతో శివుడిని తలుస్తూ తెల్లవారు నాలుగో జాము వరకు మెలుకువగానే ఉంటాడు. అది అతనికి ఆ జాగరణ ఫలితం దక్కుతుంది. ఆ రోజు శివరాత్రి అని తెలియకపోయినా.. అతను అనుకోకుండా చేసిన ఆ పుణ్యకార్యం.. అతని మార్పుకు నాంది పలుకుతుంది. ఆ పూజా ఫలితంగా అతనిలో మంచి పరివర్తన వస్తుంది. ఇక ఆ జింకలు సత్య నిష్టతో ఉండటంతో అవి ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా ఆకాశంలో చేరిపోయాయి. ఇక భోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయే లుబ్ధక నక్షత్రం గా నిలిచిపోయాడని పురాణాలు పేర్కొంటున్నాయి.