ఆల్కహాల్ తాగండి మంచిదే... కానీ, కండీషన్స్ అప్లై... !
ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది అనే విషయం ఆల్కహాల్ విషయంలో కూడా వర్తిస్తుంది. ఆల్కహాల్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
110

మీ శరీరానికి ఆల్కహాల్ ఎంత చెడ్డదో, కాలేయాన్ని ఎలా దెబ్బతీస్తుందో, అనేక ఆరోగ్య సమస్యలకు ఎలా దారితీస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ, మద్యం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా?

210
ఏంటీ కొత్త విషయం చెబుతున్నారు.. అంటారా? నిజంగానే నిజం.. ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది అనే విషయం ఆల్కహాల్ విషయంలో కూడా వర్తిస్తుంది. ఆల్కహాల్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

310
మంచిది కదా అని ఉదయం లేవగానే వోడ్కా బాటిల్ పుచ్చుకుని కూర్చోవడం సరికాదు. చాలామితంగా తీసుకున్నప్పుడే అది ఆరోగ్యప్రయోజనాల్ని అందిస్తుంది.
Liquor
410
రోజు మొత్తంలో స్త్రీలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింక్ లవరకు తీసుకుంటే మంచిది. ఒక డ్రింక్ లో 12 ఔన్సుల బీర్ (355 మి.లీ), 5 ఔన్సుల వైన్ (148 మి.లీ) లేదా 1.5 ఔన్సుల మద్యం (44.3 మి.లీ) ఉంటాయి.

510
ఈ మోతాదు శరీరానికి మంచిది. అందుకే ఇంతకు మించి తాగితే ఆరోగ్యప్రయోజనాలు పెరగవు సరికదా హానికరంగా మారుతుంది. మరి మద్యం మితిగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూస్తే..

610
ఆయుష్షు పెరుగుుతుంది : మితంగా తాగడం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అతిగా ఒక్కసారే తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని దీనివల్ల తేలింది. అంతేకాదు ఆల్కహాల్ మరణాల ప్రమాదం 25% తగ్గింది.

710
2018లో PLOS మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, మద్యం పూర్తిగా తాగని వారికంటే మితంగా తాగినవారే ఎక్కువకాలం జీవిస్తారని తేలింది.

810
గుండెసమస్యలు తగ్గుతాయి : అతిగా తాగడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను దారితీస్తాయి. అయితే, మితమైన మద్యపానం గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా తాగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా ధమనులు గట్టిపడడం లాంటివి 25% నుండి 40% వరకు తగ్గుతుందని కనుగొనబడింది. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలను (హెచ్‌డిఎల్) పెంచుతుంది, ఇది శరీరానికి మంచిది.
liquor
910
మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది : క్రమం తప్పకుండా మితంగా తాగేవారికి కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం తక్కువ. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లలాంటి పదార్థాలు కరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుందని గమనించాలి.

1010
మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది : మితమైన మద్యపానం వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు కాకుండా, తాగడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మితంగా తాగే వ్యక్తులు సంతోషంగా, కేర్ ఫ్రీగా ఉన్నారని తేలింది. స్నేహితులతో కలిసి తాగడం కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు సామాజిక, వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండటానికి తోడ్పడుతుంది.

Latest Videos