ఇలా చేస్తే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..!
ఈ ఆయిల్స్ ని వాటర్ లో లేదంటే... కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో దోమలు ప్రవేశించే ప్రదేశాలు, మూలల్లో స్ప్రే చేస్తే సరిపోతుంది. దోమలు రాకుండా ఉంటాయి.
వర్షాకాలం మాత్రమే కాదు... ఎండాకాలం కూడా ఇంట్లోకి విపరీతంగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ దోమలు కుడితే డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ... ఎంత జాగ్రత్తగా ఉన్నా.. దోమలను ఇంట్లోకి రాకుండా ఆపలేం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఈ కింది చిట్కాలతో మీరు ఇంట్లోకి దోమలు రాకుండా ఆపవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
1.మీ ఇంట్లో కర్పూరం ఉందా..? అయితే.. దోమలు పరారైనట్లే. కర్పూరం బిల్లలను నీటిలో వేసి కరగనివ్వాలి ఇప్పుడు ఆ నీటిని ఇంటి మూలల్లో లేదంటే... బయట ఆరు బయట ప్రదేశాల్లో ఉంచాలి. ఈ కర్పూరం నీరు.. ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడంలో కీలకలంగా పని చేస్తుంది. అదేవిధంగా దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే వస్తాయి కాబట్టి.. ఆ సమయంలో తలుపులు, కిటీకీలు వేస్తూ ఉండాలి. అప్పుడు దోమలు రాకుండా ఉంటాయి.
2.మార్కెట్లో చాలా రకాల చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ లభిస్తున్నాయి. లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ లాంటివి ఉంటాయి. ఈ ఆయిల్స్ ని వాటర్ లో లేదంటే... కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో దోమలు ప్రవేశించే ప్రదేశాలు, మూలల్లో స్ప్రే చేస్తే సరిపోతుంది. దోమలు రాకుండా ఉంటాయి.
3.దోమలు.. వెల్లుల్లి వాసనకు తొందరగా పారిపోతాయి. ఇంట్లో గార్లిక్ స్ప్రేని చల్లడం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. లేదంటే.. కొన్ని లవంగాలను దంచి.. వెల్లుల్లి కూడా దంచి రెండింటినీ కలపాలి. లేదంటే.. వెల్లిల్లి రెబ్బల్లో లవంగాలను గుచ్చాలి. ఇలా ఏది చేసినా ఈ వాసనకు దోమలు ఇంట్లోకి రావు.
4.చాలా మంది బరువు తగ్గడం కోసం యాపిల్ సైడర్ వెనిగర్ వాడుతూ ఉంటాం. అయితే... దీనితోనే కూడా దోమలు పారిపోయేలా చేయవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ ని నీటితో కలిపి.. దోమలు వచ్చే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే సరిపోతుంది.
5.దోమలు.. లైట్స్ కి ఎక్కువ గా ఆకర్షణకు గురౌతాయి. అందుకే.. దోమలు ప్రవేశించే సమయంలో.. బాల్కనీలో లైట్స్ ఆఫ్ చేయాలి. లేదు.. మాకు లైట్ కావాలి అంటే... జోరో బల్స్, ఎల్ఈడీ లైట్స్ వాడటం ఉత్తమం.
6.ఇంట్లో , బాల్కనీలో పుదీనా మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి. పుదీనా ఆకుల వాసనకి కూడా దోమలు తొందరగా ఇంట్లోకి ప్రవేశించవు.