MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss Fruits: తొందరగా బరువు తగ్గాలనకుంటున్నారా? అయితే ఈ పండ్లను తినండి..

Weight Loss Fruits: తొందరగా బరువు తగ్గాలనకుంటున్నారా? అయితే ఈ పండ్లను తినండి..

Weight Loss Fruits: ప్రపంచమంతటా  వేగంగా పెరుగుతున్న సమస్య ఊబకాయం. దీని బారిన పడి ఎంతో మంది అర్థాంతరంగా చనిపోతున్నారు. ఊబకాయంతో బాధపడేవారికే సర్వరోగాలు వచ్చేది. అందుకే  ఈ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి వీరు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతున్నారు. అయితే మీ డైట్ లో ఈ  పండ్లను చేర్చుకుంటే కూడా బరువు తొందరగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 12 2022, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
weight loss

weight loss

Weight Loss Fruits:మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా నేడు ఎంతో మంది ఊబకాయం బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అన్ని దేశాల్లో ఈ సమస్య పెను సవాలుగా మారింది. ఒక్క సారి అధిక బరువు సమస్య బారిన పడితే .. సామాన్యంగా దీని నుంచి బయటపడటం చాలా కష్టం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
weight loss

weight loss

ఊబకాయం సమస్యను నియంత్రించడానికి వీరు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతున్నారు. అలాగే ప్రత్యేక డైట్ ను పాటిస్తున్నారు. అయినా అధిక బరువు మాత్రం తగ్గడం లేదు. 

37
weight loss

weight loss


వెయిట్ లాస్ కోసం ప్రత్యేక డైట్ ను పాటించడంతో పాటుగా, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ వేసవిలో తొందరగా బరువు తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వేసవిలో లభించే కొన్ని రకాల పండ్లు బరువు తగ్గే ప్రాసెస్ ను మరింత సులభతరం చేస్తాయి. కాబట్టి మీరు ఈ ఎండాకాలంలో కొవ్వులు తక్కువగా ఉండే, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను మీ డైలీ డైట్ లో చేర్చండి. ఈజీగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఈ పండ్లతో మీరు ఈ వేసవి కాలం హైడ్రేటెడ్ గా కూడా ఉంటారు. ఇందుకు ఎలాంటి పండ్లు తినాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

47

పుచ్చకాయ: పుచ్చకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది  ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి సహకరిస్తుంది. బరువను కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు ఈ పుచ్చకాయలో Natural sugar ఉండటం వల్ల ఇది మన బాడీకి అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. 
 

57

బొప్పాయి: బరువు తగ్గే ప్రాసెస్ ను  బొప్పాయి పండు మరింత సులభతరం చేస్తుంది. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాగా ఇది ఆకలి ఎక్కువగా కాకుండా చేస్తుంది. అలాగే  Digestion system మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది కూడా. ముఖ్యంగా ఈ పండులో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లే. అంతేకాదు ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది.

67

పైనాపిల్:  మెరుగైన ఆరోగ్యానికి పైనాపిల్ ఎంతో అవసరం. ఇది రుచితో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల Digestion మెరుగ్గా పనిచేస్తుంది. వెయిట్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ పండులో Anti-inflammatory గుణాలు ఉండటంతో జీర్ణక్రియ పెరుగుతుంది. ముఖ్యంగా ఇది బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. 
 

77
lychee fruit

lychee fruit

లిచ్చి: ఈ పండు ఎక్కువగా ఎండాకాలంలోనే దొరుకుతుంది. ఈ పండులో Antioxidant గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఈ పండును ప్రతిరోజూ తినడం వల్ల వేసవి దాహం కూడా తీరుతుంది. అలాగే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman : హనుమంతుడి నుండి ఈ 5 పాఠాలు నేర్చుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది
Recommended image2
Pressure Cooker: కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చేస్తే వాటర్ బయటకు రాదు
Recommended image3
Skin Allergies: గిల్టు నగలతో అలర్జీ వస్తుందా? ఈ టిప్ ట్రై చేేయండి..ఇంకెప్పుడూ ఆ సమస్యే ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved