మూడు పూటలా సూప్‌లు,సలాడ్లే తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
మూడు పూటలా భోజనంలో సలాడ్లు, సూప్‌లు తినడం ఆరోగ్యకరమేనా? అంటే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది సమతుల ఆహారం కిందికి రాదు. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు చాలా ముఖ్యమైనవని. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. కాబట్టి, ఆహారాన్ని ఆరోగ్యంగా... సమతుల్యంగా చేయడానికి అవసరమైన అన్ని పోషకాలు, ఖనిజాలు ఉండేలా చూసుకోండి.
బరువు తగ్గడంలో అనేక మార్గాలు. ఒకేసారి డ్రాస్టిక్ గా బరువు తగ్గడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పటొచ్చు కానీ.. ఇది మంచిది. అయితే బరువు తగ్గే ప్రక్రియలో తీసుకునే ఆహారంలో సూప్ లు, సలాడ్ లు ముఖ్య భూమిక పోషిస్తాయి. ముందు వరుసలో ఉంటాయి. సూప్ లు, సలాడ్ లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని అనుకుంటారు. అయితే ఇవి అన్నివేళల్లో అనుకున్నంత అద్భుతమైనవైమీ కావని అరోగ్య నిపుణులు అంటున్నారు.
వెయిట్ లాస్... వెయిట్ లాస్.. వెయిట్ లాస్... ఇటీవలి కాలంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు. ఆహారంలో ఎన్నో మార్పులు. చిరుధాన్యాలు, జ్యూస్లు, మొలకెత్తిన గింజలు, సూపులు, సలాడ్లు .. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం.. ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. సూప్స్, సలాడ్స్ లో అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిల్లో ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్య నిపుణులు సూప్‌లు, సలాడ్ ల మీద ఉన్న అపోహల గురించి చెబుతున్నారు. డైట్ చేసే క్రమంలో.. సరిగ్గా తినడం మేనేజ్ చేయడం అనేది విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు ఏ ఫుడ్ తీసుకుంటే హెల్త్ కి మంచిది.. వందశాతం ఆరోగ్యానికి సమకరిస్తుంది అని తెలుసుకోవడం ఎప్పుడూ ప్రశ్నగానే ఉంటుంది. ఇక సూప్స్, సలాడ్స్ లో ఎలాంటి కాంబినేషన్స్ మంచివి అనేవి కూడా తెలుసుకోవాలి. ఇది కొంచెం కత్తిమీద సాములాంటిదే అనుకోవచ్చు.
సూప్‌లు, సలాడ్‌లలో చాలా రకాల కూరగాయలు, ఆకుకూరల ఉన్నందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, అయితే మీ సూప్‌లో చక్కెర లేదా గట్టిపడే ఏజెంట్స్ ఏవైనా ఉంటే అవి ఆరోగ్యకరమైనది కాదు. ఇక ఇంకో ముఖ్య విషయం.. సలాడ్ల కోసం వాడే ఆకుకూరలు, కూరగాయలను తాజాగా ఎంచుకోవడం, అప్పటికప్పుడు తాజాగా కోయడం లాంటివి చేయకపోతే వాటిలోని యాంటీఆక్సిడెంట్లు పూర్తిగా శరీరానికి అందించబడవు. అంతేకాదు మీ సలాడ్‌లో ప్రోటీన్ కంటెంట్ లేకపోతే భోజనం పూర్తి కాదు.. అని వారు చెబుతున్నారు.
మూడు పూటలా భోజనంలో సలాడ్లు, సూప్‌లు తినడం ఆరోగ్యకరమేనా? అంటే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది సమతుల ఆహారం కిందికి రాదు. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు చాలా ముఖ్యమైనవని. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. కాబట్టి, ఆహారాన్ని ఆరోగ్యంగా... సమతుల్యంగా చేయడానికి అవసరమైన అన్ని పోషకాలు, ఖనిజాలు ఉండేలా చూసుకోండి.
సూప్ లు, సలాడ్ లు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని చిట్కాలు..
కూరగాయలు ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి. సూప్ లు, సలాడ్ లు తయారు చేసేముందే వీటిని కట్ చేయాలి. వీటిల్లో తప్పనిసరిగా ప్రోటీన్స్ ఉండేటా చూసుకోండి. బీన్స్, పప్పు, టోఫు, పనీర్, గుడ్డు, కోడి, చేప లాంటివి.
ఇక సూపర్ హెల్తీ ఫ్యాట్స్ (నట్స్ లేదా సీడ్స్) ను కూడా యాడ్ చేయాలి. అలాగే సూప్ లేదా సలాడ్ ను డ్రెస్సింగ్ చేయడానికి వాడేదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. కొనుక్కువచ్చినవి వాడకపోవడమే మంచిది.
సూప్ లో చక్కెరలు లేకుండా చూసుకోండి. కూరగాయలు, తాజా పండ్లను మాత్రమే చేర్చుకోవాలి. దీంతోపాటు సూప్ లలో కార్న్ ఫ్లోర్ అస్సలు వాడకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకునే సూప్ లు, సలాడ్ లు ఆరోగ్యవంతమైనవేనా చెక్ చేసుకోండి.