వాస్తు ప్రకారం.. పడకగదిలో ఇవి అసలే ఉండకూడదు..
జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ముందు పడక గది బాగుండాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారమే ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్ రూపంలో ఇవి అసలే ఉండకూడదు.

ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపేది ఒక్క పడకగదిలోనే. ప్రశాంతంగా నిద్రపోయేది ఒక్క బెడ్ రూం లోనే. అందుకే బెడ్ రూం వాస్తు ప్రకారమే ఉండాలి. ఇదే ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా.. సంబంధాలు బాగుండాలన్నా.. బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి. ఒక వేళ ఈశాన్య దిశలో ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ఇకపోతే ఈ బెడ్ రూం ఆగ్నేయ దిశలో ఉంటే జంటల మధ్య గొడవలు వస్తాయి.
అలాగే గది నైరుతి మూలలోనే మంచాన్ని పెట్టాలి. మీ తల పడమరకు అభిముఖంగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూం ఇంటి నడి మధ్యలో ఉండకూడదు. ఇంటి లోపలి మధ్య ప్లేస్ ను బ్రహ్మస్థానం అంటారు. దీన్ని శక్తి వనరు అని కూడా అంటారు. వాస్తు ప్రకారం.. పడకగదిలో కొన్నింటిని అసలే పెట్టకూడదు. అవేంటో తెలుసుకుందాం పదండి.
మీ బెడ్ ముందు అద్దాన్ని పెట్టకూడదు. టీవీ కూడా ఉండకూడదు. ఎందుకంటే బెడ్ పై పడుకున్నప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం కనిపించకూడదు. ఇలా కనిపిస్తే.. ఇంట్లో గొడవలు జరుగుతాయి. భాగస్వాముల మధ్య తగాదాలకు దారీస్తుంది.
బెడ్ రూం గోడలకు న్యూట్రల్ లేదా ఎర్త్ కలర్ లో పెయింట్ ను వేయడం మంచిది. ఎందుకంటే ఈ పెయింట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. గోడలకు నల్ల కలర్ ను వేయకూడదు.
బెడ్ రూం లో దేవుళ్ల ఫోటోలు కానీ.. గుడి లేదా ప్రార్థనా స్థలం ఉండకూడదు.
పడకగదిలో నీరు లేదా ఫౌంటెన్ పెయింటింగ్స్ అసలే ఉండరాదు. ఎందుకంటే ఇవి భావోద్వేగ ప్రకోపాలకు దారితీస్తుంది.
బెడ్ రూంలో మూడ్ లైటింగ్ నే ఉపయోగించాలి. పడకగదిలో ప్రశాంతంగా ఉండేందుకు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించొచ్చు.
నైరుతి లేదా పడమర గోడల వైపే మీ మంచాన్ని పెట్టాలి. ఒకవేళ ఇలా లేకపోతే.. గోడకు బెడ్ మధ్య నాలుగు అంగుళాల దూరం ఉండేట్టు చూసుకోండి.
మీ తలుపునకు అభిముఖంగా మీ తలను పెట్టి పడుకోకూడదు. ఎందుకంటే ఇలా పడుకుంటే పీడకలలు వస్తాయి.
ఒకవేళ మీ బెడ్ దూలం కింద ఉండకూడదు. దీనివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు.
పడకగదిలో వాటర్ మగ్ పక్కగా ఉంటుంది. అయితే ఇది ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. ఎందుకంటే నిద్రలో సమస్యలను కలిగిస్తుంది. అలాగే రాత్రి బెడ్ రూంలో ఉన్న బాత్ రూం డోర్ ను అస్సలు తెరవకూడదు.