పెదాల గురించి మీకు తెలియని కొన్ని విషయాలు
మనం తినడానికి, మాట్లాడటానికి పెదాలు చాలా చాలా అవసరం. అంతేకాదు నవ్వడానికి, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి అవసరమే కదా. మన పెదాల గురించి మనకు ఈ మాత్రం విషయాలు తెలుసు. ఇంతకు మించి వీటి గురించి తెలుసుకోవడానికి ఏముందని చాలా మంది అనుకుంటారు. కానీ పెదాల గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి మరి.
Beauty
మీ పెదాలు ప్రత్యేకమైనవి
వేలి ముద్రలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఒకరి వేలిముద్రలు మరొకరితో మ్యాచ్ కావు. అలాగే మీ పెదాలు కూడా ఇలాగే ప్రత్యేకమైనవేనంటున్నారు నిపుణులు. అవును ఈ గ్రహం మీదున్న 7.8 బిలియన్ల మంది లిప్ స్టిక్ పెట్టుకుని పెదాలను ప్రింట్ చేస్తే ఒకరిది మరొకరితో సమానంగా ఉండవట.
చేతివేళ్లకంటే సున్నితమైనవి
మన పెదవులు ఒక మిలియన్ కంటే ఎక్కువ ఎన్నో రకాల నరాల చివరలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి మీ శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటిగా పరిగణించబడతాయి. అంతేకాదు ఇవి మన చేతివేళ్ల కంటే 100 రెట్లు ఎక్కువ సున్నితమైనవి. ఎందుకంటే వీటిని రక్షించడానికి రక్షణాత్మక పొర ఉండదు కాబట్టి. అందుకే చిన్న పిల్లలు ప్రతిదాన్ని నోట్లో పెట్టుకుంటారు.
lips
పెదవుల చర్మంపై తక్కువ పొరలు
మన పెదవులపై చర్మం చాలా సన్నగా ఉంటుంది. మన శరీరంలోని 16 పొరలతో పోలిస్తే కేవలం మూడు నుంచి ఆరు పొరల కణాలు మాత్రమే పెదాలపై ఉంటాయి . పెదాలపై చాలా తక్కువ పొరలు ఉండటం, రక్త నాళాలు ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల మన పెదాలు పింక్, రెడ్ గా కనిపిస్తాయి. లేత రంగు పెదవుల కంటే ఎర్రటి పెదాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లిప్ స్టిక్ బాగా అమ్ముడవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పెదాలకు చెమట పట్టదు
మీరెప్పుడైనా గమనించారా? ఒంటినిండా చెమట పట్టినా.. పెదాలకు చుక్క చెమట కూడా పట్టదు. అవును మన పెదవులకు చెమట అసలే పట్టదు. ఎందుకంటే మన పెదవులకు చెమట లేదా నూనె గ్రంథులు ఉండవు. చెమట లేదా మొటిమలు పెదాలపై కానే కావు. కేవలం పొడిబారుతాయి అంతే.
వయసు పెరిగే కొద్దీ పెదవులు పల్చగా మారతాయి
నిండుగా, బొద్దుగా ఉండే పెదవులు మనల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే మన వయసు పెరిగే కొద్ది పెదాల అందం తగ్గుతుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్, హైలురోనిక్ ఆమ్లం సరఫరా తగ్గుతుంది. దీనివల్ల చర్మం పరిమాణం తగ్గుతుంది.
ఆర్బిక్యులారిస్ ఓరిస్
ట్రంపెట్ వాయించడం, విజిల్ చేయడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటి సామర్థ్యాన్ని మనకు ఇచ్చేది ఓర్బిక్యులారిస్ ఓరిస్ సంకోచం. అది లేకుండా మనం బతకలేం. ఆర్బిక్యులారిస్ ఓరిస్ పెదవుల లోపల ఒకే స్పింక్టర్ కండరం అని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఇప్పుడు ఇది నాలుగు కండరాల సముదాయమంటున్నారు శాస్త్రవేత్తలు.
భావోద్వేగాలను
మన పెదవులు తమంతట తాముగా ఎన్నో విషయాలను కూడా వ్యక్తీకరించగలవు. విచారం, ఆనందం, కోపం, భయం, షాక్, కుతూహలం ఇలా ఎన్నో .. మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇతరులకు తెలియజేయగలవు ఎప్పుడైనా గమనించారా..
నోటి క్యాన్సర్ ముప్పుఆడవారికే ఎక్కువ
పురుషులతో పోలిస్తే ఆడవారికే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హానికరమైన యూవీ కిరణాల నుంచి పెదాలను రక్షించే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పదార్థాలున్న లిప్ స్టిక్ , లిప్ బామ్ వంటి మేకప్ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల ఆడవారికే ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని నిపుణులు అంటున్నారు.