రాత్రుళ్లు బ్రా ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
చాలా మంది రాత్రుళ్లు కూడా బ్రా ధరించి పడుకుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే సమయంలో టైట్ గా ఉండే బ్రా ధరించి పడుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రాత్రుళ్లు బ్రా ధరించి పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఆడవాళ్లు బ్రా వేసుకునే పడుకుంటారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని స్త్రీరోగ నిపుణులు డాక్టర్ అన్నా టార్గోన్స్కాయ చెప్తున్నారు. 'ఫ్లో' అనే ఆరోగ్య యాప్ లో రాత్రిళ్లు బ్రా వేసుకుని పడుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి డాక్టర్ అన్నా వివరించారు.
కొంతమందికి బ్రా వేసుకుని పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నిద్రలో బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. బ్రాలో ఎలాస్టిక్ ఉన్న చోట పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. చర్మ సౌందర్యానికి ఇది పెద్ద సమస్య. రాత్రిళ్లు బ్రా వేసుకుంటే పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
రాత్రిళ్లు బిగుతుగా ఉండే బ్రా వేసుకుంటే ఇబ్బందిగా ఉండి, నిద్ర సరిగ్గా పట్టదు. సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. బిగుతుగా ఉండే బ్రా వల్ల అలెర్జీలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిళ్లు బ్రా వేసుకుంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల స్థనాల్లో నరాలు లాగినట్టు అనిపిస్తుంది. ఇది తీవ్ర అసౌకర్యానికి కారణమవుతుంది. అలాగే పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
బ్రా బిగుతుగా ఉంటేనే మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ బిగుతైన బ్రా వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఉదయం ధరించే సమయంలో కూడా బ్రాలు మరీ టైట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రుళ్లు బ్రా లేకుండా పడుకోవాలి. లేదంటే వదులుగా ఉండే బ్రాలను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.