MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Monsoon Skincare Tips: వర్షాకాలంలోనే చర్మ సమస్యలు ఎక్కువొస్తయ్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..!

Monsoon Skincare Tips: వర్షాకాలంలోనే చర్మ సమస్యలు ఎక్కువొస్తయ్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..!

Monsoon Skincare Tips: వర్షాకాలంలో అనేక జబ్బులతో పాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై దురద, మంట, శరీర దుర్వాసన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ సీజన్ లో చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. 

3 Min read
Mahesh Rajamoni
Published : Jun 28 2022, 10:05 AM IST| Updated : Jun 28 2022, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఎండాకాలం పోయి వానకాలం ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో పాటుగా ఎన్నో సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. అందుకే ఈ సీజనల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వానాకాలంలో అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.  అందుకే వర్షాకాలంలో చర్మ సంరక్షణ చర్యలను తప్పక తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లో బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణంగా సోకుతాయి. కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి బట్టలను మాత్రమే ధరించాలి. వర్షంలో తడిస్తే.. వీలైనంత తొందరగా బట్టలను మార్చుకోవాలి. జిమ్ కోసం తేమను తొలగించే బట్టలను ధరించం. అలాగే వ్యాయామం తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఇక మీ చెప్పులు కూడా తడిగా లేకుండా జాగ్రత్త పడాలి. 

211

రుతుపవనాలు చర్మాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?

అధిక తేమ అధిక చెమటకు కారణమవుతుంది. ఇది కాస్త చర్మం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. దీంతో రంధ్రాలు మూసుకుపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వర్షాకాలంలో సర్వ సాధారణంగా జనాలు ఎక్కువగా ఈ సమస్యలనే ఎదుర్కొంటారు. 

311
Body odor

Body odor

శరీర దుర్వాసన (Body odor): అధిక చెమట పట్టడం వల్ల చంకల్లో (Under Arms), శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.  అలా అని Deodorants ఉపయోగించడం వల్ల అలెర్జీ దద్దుర్లు వస్తాయి. అందుకే అన్నీ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి. చెమట, వాసనను నివారించడానికి కాటన్ దుస్తులను ధరించండి. అవసరమైతే Under Arms లో Sweat pad లను కూడా మీరు ఉపయోగించవచ్చు.

411

చెమట దద్దుర్లు (Sweat rash): వైద్యపరంగా మిలియారియా అని పిలువబడే ఎర్రటి దురద దద్దుర్లు శరీరంపై కనిపిస్తాయి. ఇది ప్రధానంగా మొండెం మీద కనిపిస్తుంది. చెమట గ్రంథులలో ఒక బ్లాక్ దీనికి ప్రధాన కారణం. చల్లని, వెలుతురు వచ్చే ప్రదేశానికి వెళ్లడం వల్ల ఇవి ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సీజన్ లో వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. 
 

511

ఫంగల్ చర్మ సంక్రామ్యతలు (Fungal skin infections): ఈ సీజన్ లో శిలీంధ్రాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా ఇవి వేడి,  తేమతో కూడిన పరిస్థితుల్లోనే వృద్ధి చెందుతాయి Ringworm తో పాటుగా ఇతర అంటువ్యాధులు కాలి వేళ్ల మధ్య, రొమ్ముల కింద, అండర్ ఆర్మ్స్, గజ్జలు వంటి శరీర మడతలలో కనిపిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ఇటువంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

611

గజ్జి (Itching): అధిక చెమటతో కూడిన తేమ చర్మాన్ని పొడిగా మారుస్తుంది. ఇది తామర వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఇది ఎరుపు, దురద దద్దుర్లు ఏర్పడతాయి. 

711

మీకు సున్నితమైన చర్మం ఉంటే 10 రోజులకు ఒకసారి Exfoliate చేయండి:  వారానికొకసారి ఎక్స్ ఫోలియేషన్ కు వెళ్లడం ద్వారా చనిపోయిన చర్మ కణాలు, మురికి తొలగిపోతుంది. ఇందుకోసం శరీరంపై సహజ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ ఉపయోగించండి. ఇది మీ చర్మ రంధ్రాలను Analog చేస్తుంది. శుభ్రపరుస్తుంది. మొటిమలు (Acne) అవకాశాలను తగ్గిస్తుంది.
 

811

సన్ స్క్రీన్ ను స్కిప్ చేయొద్దు

సీజన్లతో సంబంధం లేకుండా సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా వాడాలి. ఇక ఈ సీజన్ లో బయటకు రావడానికి 20 నిమిషాల ముందుగానే దీన్ని అప్లై చేయండి. అలాగే మీరు బయట గడిపే ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేస్తూ ఉండాలి.

911

మాయిశ్చరైజర్ అప్లై చేయండి

Sunscreen మాదిరిగానే.. మాయిశ్చరైజర్ కూడా అన్ని సీజన్లలో తప్పనిసరి. చర్మాన్ని తేమగా, హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల మీ ఆయిల్ గ్రంధులు ఆయిల్ లేదా సెబమ్ ని అధికంగా ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

1011

జిడ్డు చర్మం (Oily skin)కోసం చిట్కాలు

జిడ్డు చర్మం ఈ సీజన్ లో మరింత జిడ్డుగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం రెండుసార్లైనా సున్నితమైన ఫేస్ వాష్ తో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోండి. చర్మాన్ని ఆరోగ్యంగా, రంధ్రాలు బిగుతుగా ఉంచడానికి సున్నితమైన టోనర్ ఉపయోగించండి. తేలికపాటి మాయిశ్చరైజర్ తో ఫాలోప్ చేయండి.

 

1111

పొడిబారిన చర్మానికి చిట్కాలు:  శుభ్రం చేసిన తరువాత మీ చర్మాన్ని తప్పకుండా మాయిశ్చరైజ్ చేయండి. హైడ్రేటెడ్ గా ఉండండి.  మేకప్ తొలగించకుండా పడుకోవద్దు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved