MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • skin care tips: ఆయిల్ స్కిన్ కు ఇలా గుడ్ బై చెప్పేయండి..

skin care tips: ఆయిల్ స్కిన్ కు ఇలా గుడ్ బై చెప్పేయండి..

skin care tips:ప్రస్తుతం చాలా మంది ఆయిల్ స్కిన్ తో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టేక్కేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా జిడ్డు అలాగే  కారుతూ ఉంటుంది. అలాంటి వారు కొన్ని సింపుల్ టిప్స్ తో జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పేయొచ్చు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2022, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆయిల్ స్కిన్ ప్రాబ్లమ్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ స్కిన్ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో క్రీమ్స్, సబ్బులను వాడుతూ ఉంటారు. అయినా ఈ సమస్య అస్సలు తగ్గదు కదా.. ఎప్పటి లాగే జిడ్డు కారుతూ ఉంటుంది. ఆయిల్ స్కిన్ తో మొఖంపై మొటిమలు, మచ్చలు రోజు రోజుకు పెరిగిపోతూనే  ఉంటాయి.

28

జిడ్డు చర్మానికి కారణం ఇదే:  కొందరిలో స్కిన్ లోపలుండే సెబేషియస్ గ్రంధులు స్రావాన్ని అవసరానికి మించి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి. దీనివల్లే వారి ఫేస్ జిడ్డుగా తయారవుతుంది.   అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పొచ్చు. అదేలా అంటే..

38

పాలు: పచ్చి పాలు లేదా కాగబెట్టిన పాలను ముఖానికి అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత ఫేస్ ను నీట్ గా కడగాలి. పాలలో చర్మంలోపల పేరుకుపోయిన జిడ్డును వదిలించే గుణముంటుంది.

48

తేనె: తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ తేనె జిడ్డును తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. కొద్దిగా తేనెను తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. దాన్ని ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని లేదా గోరు వెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల జిడ్డు తొలగిపోతుంది.

58

లాక్టిక్ యాసిడ్: లాక్టిక్ యాసిడ్ వల్ల కూడా జిడ్డుతనం వదులిపోతుంది. లాక్టిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉండే పదార్థాలను ముఖానికి రాసుకుంటే జిడ్డు వదులుతుంది. అంతేకాదు ముఖంపై పోరుకుపోయిన మురికి కూడా పోతుంది. 

68

రోజ్ వాటర్: చర్మ సౌందర్యానికి రోజ్ వాటర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాగా రోజ్ వాటర్ లో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే జిడ్డు వదిలిపోతుంది. 

78

వేడి నీళ్లతో:  జిడ్డు చర్మం  ఉన్న వాళ్లకు వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి సబ్బులు, క్రీములు పెట్టకుండా మొహాన్ని వేడినీళ్లతో కడగాలి. ఇలా చేస్తే చర్మంలో పేరుకుపోయిన జిడ్డు సులభంగా వదిలిపోతుంది. 

88

ఇవి కూడా తినాలి: చర్మ సంరక్షణకు తాజా పండ్లు, కూరగాయలు కూడా ముఖ్యమే. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల  స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Oil: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే...జుట్టు వద్దన్నా పెరుగుతుంది.
Recommended image2
Child Psychology: నల్లగా ఉన్నావ్, లావుగా ఉన్నావ్.. ఈ మాటలు పిల్లల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయి?
Recommended image3
Nalla Fry: నల్ల ఫ్రై.. మీకు మేక రక్తం వేపుడు అంటే ఇష్టమా? ఇది తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved