MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండలు మండిపోతున్నాయి. ఇంకేముంది ఉక్కపోతలను తట్టుకోలేక ఫ్యాన్లు, ఏసీలను వాడుతుంటాం. అయితే వీటి వాడకం వల్ల కరెంట్ బిల్లు ఎక్కడ ఎక్కువగా వస్తుందోనని భయపడి వీటిని ఆన్ కూడా చేయని వారున్నారు. కానీ కొన్ని ట్రిక్స్ తో ఏసీని ఎంత వాడినా కరెంట్ బిల్ మాత్రం తక్కువగానే వస్తుంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 02 2024, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎండాకాలంలో ఫ్యాన్లు, ఏసీలను వాడకుండా ఉండటం చాలా కష్టం. మండిపోతున్న ఎండలకు ఇళ్లంతా నిప్పుల కుంపటిలా మారుతుంది. అందుకే ఉదయం 10 కాగానే ఫ్యాన్లు, ఏసీలను ఆన్ చేస్తుంటారు. అలాగే కొంతమంది బయటకు వెళ్లి రాగానే ఏసీని ఫుల్ లో పెట్టేసి కూర్చుంటారు. కానీ ఏసీల వాడకం వల్ల కరెంట్ బిల్లు వాచిపోతుందని చాలా మంది భయపడిపోతుంటారు. ఈ కారణంగానే చాలా మంది ఎంత ఉక్కపోతగా ఉన్నా కొద్ది సేపు మాత్రమే ఏసీలను వాడుతుంటారు. కానీ మీరు గనుక కొన్ని సింపుల్ ట్రిక్స్ ను ఫాలో అయ్యారంటే మాత్రం పొద్దంగా ఏసీని వాడినా కరెంట్ బిల్లు మాత్రం ఎక్కువగా రాదు.
 

24

చాలా మంది ఏసీని ఎక్కువలో పెట్టేసి నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుంటుంటారు రాత్రిళ్లు. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదంటే ఏసీని 24, 23 డిగ్రీలు పెట్టి చలికి వణికేటట్టు మాత్రం పెట్టకూడదు. ఇలాంటప్పుడు మీకు ఏసీ అవసరం లేదు కదా. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఉష్ణోగ్రతను ఒక యూనిట్ తగ్గించడం వల్ల విద్యుత్ విద్యుత్ వినియోగం 6 శఆతం పెరుగుతుందట. నార్మల్ గా మనం కంఫర్ట్ బుల్ గా ఉండాలంటే మాత్రం ఏసీని 25, 26 డిగ్రీల్లో థర్మోస్టేట్ తోని ఏసీని పెట్టుకుని ఫ్యాన్ ఆన్ చేసుకుని తక్కువలో పెట్టుకుంటే మనకు కూల్ ఎయిర్ వస్తుంది. చల్లగా అనిపిస్తుంది. తర్వాత ఏసీ థర్మోస్టేట్ మీద ఆన్ అవ్వడం, ఆఫ్  అవ్వడం జరుగుతుంది. దీనివల్ల చల్లగానూ ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువగా గానూ వస్తుంది. దీనివల్ల 50 శాతం కరెంట్ ఆదా అవుతుంది.
 

34

అయితే చాలా మంది ఎండకు తిరిగి ఇంటికి రాగానే 18 టెంపరేచర్ లో ఏసీ పెడుతుంటారు. ఇది చాలా ఎక్కువ. దీనివల్ల కరెంట్ బిల్లు బాగా వస్తుంది. నిజానికి మీరు ఎంత ఎండలో వచ్చినా.. ఏసీని 25,26 డిగ్రీలు పెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీరెంత ఎండలో వచ్చినా ఒక 5 నిమిషాలకే మీరు కంఫర్ట్ గా ఫీలవుతారు. అయితే చాలా మంది ఏసీని సర్వీసింగ్ చేయించరు.

44

కానీ సమ్మర్ తర్వాత కూడా ఒకసారి ఏసీని సర్వీసింగ్ చేయించాలి. ఎందుకంటే ఇంట్లో దుమ్ము వల్ల ఏసీ ఫిల్టర్లు మూసుకుపోతాయి. దీనివల్ల ఏసీ నుంచి చల్లదనం రాదు. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే సమ్మర్ తర్వాత ఏసీని సర్వీసింగ్ కు ఇవ్వాలి. దీనివల్ల ఏసీ బాగా పనిచేస్తుంది. అలాగే కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా రాదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పుస్త‌కం ఓపెన్ చేయ‌గానే నిద్ర ఎందుకు వ‌స్తుంది.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే.?
Recommended image2
Healthy Eating Tips: జామ పండును కేవలం నీటితో కడిగితే చాలదు, ఇలా క్లీన్ చేయాలి..
Recommended image3
Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved