Egg eating tips:గుడ్డులో పచ్చసొన తింటే బరువు పెరుగుతారనడం పచ్చి అబద్దం..
Egg eating tips: ఉడకబెట్టిన గుడ్డులో పచ్చసొన తినడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది పచ్చసొనను పక్కకు పెట్టేసి కేవలం తెల్ల సొనను మాత్రమే తింటుంటారు. పొచ్చ సొన తింటే బరువు పెరుగుతారనడంలో నిజమెంత ఉంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..?

Egg eating tips: ఒక వ్యక్తి ఆయురారోగ్యాలతో ఉండాలంటే రోజు ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది గుడ్డును కొత్త పద్దతిలో తింటున్నారు. ఎలా అంటే.. గుడ్డులో పచ్చసొనను పక్కన పెట్టేసి.. కేవలం తెల్ల సొననే తినడం అలవాటు చేసుకున్నారు.
ఎందుకంటే పచ్చసొనలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటదని. ఇక దాన్ని తింటే బరువు పెరిగిపోతామని భయపడుతుంటారు. అందులో లావుగా ఉన్నవాళ్లు ఈ పచ్చసొనకు వీలైనంత దూరంగా ఉంటారు. ఇక ఫిట్ నెస్ గా ఉండాలనుకునేవారు కూడా పచ్చసొనను పక్కన పెట్టేస్తుంటారు. మరి ఈ పచ్చ సొన తినడం వల్ల బరువు పెరుగుతారా? లేదా ? అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
పచ్చసొన వల్ల అనారోగ్యం పాలవడం, బరువు పెరగడం పూర్తిగా అవాస్తవాలని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్డులో ఈ భాగమే మంచిది, ఇది మంచిది కాదు అని ఎక్కడా పేర్కొనబడలేదు. గుడ్డు మొత్తం ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. అందులోనూ గుడ్డు మొత్తాన్ని తిన్నప్పుడే దానిలోని పోషకాలు మన శరీరానికి అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుడ్డును మొత్తంగా తినాలని సూచిస్తున్నారు.
ఉడకబెట్టిన గుడ్డులో ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మరెన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా గుడ్డును తినడం వల్ల మన కంటిచూపును మెరుగుపరిచే ఎ విటమిన్ అందుతుంది. అలాగే విటమిన్ బి, కె, ఈ వంటి ఎన్నో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో ఉండే కొవ్వులు మన ఆరోగ్యానికి ఎంతో అవసరమంటున్నారు నిపుణులు. కాబట్టి గుడ్డులోని పచ్చసొనను తినకూడదు, మంచిది కాదన్న అపోహల నుంచి బయటపడండని నిపుణులు చెబుతున్నారు. పచ్చ సొన కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే అని గుర్తుంచుకోండి.
సైడ్ ఎఫెక్ట్స్: మంచిది కాదని పచ్చసొనను వదిలేసి ఎప్పుడూ తెల్లసొననే తింటే మీరు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దురద, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు అందులో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాతో ఫుడ్ ఫాయిజ్ అవయ్యే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, గుడ్డు ద్వారా పోషకాలు లభించాలన్నా గుడ్డు మొత్తాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.