అశ్వగంధను ఎక్కువగా తింటే పురుషులకు ఆ సమస్యలు వస్తయ్ జర జాగ్రత్త..
ఆయుర్వేదంలో అశ్వగంధను ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇది పురుషులకు ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అలా అని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అశ్వగంధ ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇది ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది పురుషులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అశ్వగంధ పురుషులలో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అయితే డాక్టర్ సలహా లేకుండా లేదా అవసరమైన దానికంటే ఎక్కువ అశ్వగంధ తీసుకుంటే.. పురుషుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు అసలు దీనిని ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. దీన్ని పరిమితికి మించి తీసుకుంటే మాత్రం ఆ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అశ్వగంధ పురుషులకు ప్రయోజనకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ దీన్ని ఎక్కువగా వాడితనే ఆరోగ్యం దెబ్బతింటుంది.
అశ్వగంధ రూట్ సారాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య తలెత్తుతుందని రుహునా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అశ్వగంధ కామోద్దీపన మూలికగా పరిగణించబడుతున్నప్పటికీ.. పరిశోధకులు దీన్ని మోతాదుకు మించి అసలే ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఎందుకంటే..
లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది
దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితమవుతుంది. ఎందుకంటే ఇది అంగస్తంభన సమస్యను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పురుషుల లైంగిక జీవతం దెబ్బతింటుంది. ఇది పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గొచ్చు.
అకాల స్ఖలనం
అశ్వగంధను మోతాదుకు మించి ఉపయోగిఃస్తే.. సంభోగ సమయంలో అకాల స్ఖలనం సమస్య కలుగుతుంది. అయితే అశ్వగంధకు అంగస్తంభన సమస్యపై మరింత పరిశోధన అవసరమని కూడా నిపుణులు చెబుతున్నారు.
అలసిపోయినట్టుగా ఉంటారు
సాధారణంగా అశ్వగంధను ఉపయోగించడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలాగే శారీరక బలహీనత తొలగిపోతుంది. కానీ దీనిని తప్పుడు మార్గంలో లేదా, అధికంగా తీసుకోవడం వల్ల అలసట సమస్యలు వస్తాయి.
కడుపు సమస్యలు
అశ్వగంధను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల్లో కడుపు సమస్యలు సర్వసాధారణం. అశ్వగంధ తిన్న తర్వాత కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి కడుపునకు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటే.. క్షణం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని గుర్తించుకోండి.
బీపీ తగ్గుతుంది
అధ్యయనాల ప్రకారం.. అశ్వగంధ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. అయితే మీరు డయాబెటిస్ మందులను తీసుకుంటుంటే.. అశ్వగంధను తీసుకోకపోవడమే మంచిది. ఈ హెర్బ్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రమాదకరంగా తగ్గిస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలు కూడా తలెత్తొచ్చు.
వీటిని కూడా గుర్తుంచుకోండి
అశ్వగంధతో ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే.. మొదట వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనల మేరకే ఉపయోగించండి. సాధారణంగా ఒక టీస్పూన్ అశ్వగంధ పొడిని పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం ఖాళీ కడుపున తాగడం మంచిదంటారు. లేకపోతే అశ్వగంధ మూలాలను పాలలో ఉడకబెట్టి వడకట్టడం ద్వారా కూడా తీసుకోవచ్చు.