MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే ఈ జబ్బులొస్తయ్ జగ్రత్త..

రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే ఈ జబ్బులొస్తయ్ జగ్రత్త..

మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jul 23 2022, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ రోజుల్లో డయాబెటీస్ వ్యాధి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇది ఒక్కసారి వచ్చిందంటే దాన్ని పూర్తిగా తగ్గించుకోలేం. దాన్ని నియంత్రణలో ఉంచకోవడం తప్ప. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకునేందుకు మధుమేహులు జీవితాంతం ట్యాబ్లెట్లను యూజ్ చేస్తూనే ఉంటారు. ఇతరులకంటే మధుమేహల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే శరీరంలోని ఎన్నో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కంటి చూపు కూడా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ పెరిగితే గుండె పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాలు, రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. 

38

గుండె సమస్యలు

షుగర్ వ్యాధి వల్ల డయాబెటీస్ హార్ట్ డిసీజ్ బారిన పడతారు. దీనివల్ల గుండెలోని కండరాలు బలహీనంగా మారిపోతాయి..గట్టిగా మారతాయి. ఈ డయాబెటీస్ రోగం కారణంగా చాలా మంది హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్నారు. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఇతరులకంటే మధుమేహులకే 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

48

కిడ్నీ సమస్యలు

మధుమేహంతోనే కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ వ్యాధి బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి ప్రారంభమైన పది నుంచి 15  ఏండ్ల మధ్యలో చాలా మంది కిడ్నీలు దెబ్బతింటున్నాయట.
 

58

ఆహారాలను తీసుకునే విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి

మధుమేహులు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను, ఆకు కూరలను తీసుకోవాలి. పాలు గానీ, పాల ఉత్పత్తులను గానీ తీసుకోకూడదు. అలాగే స్వీట్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ను కూడా తీసుకోకూడదు. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీలను తాగకూడదు. 
 

68

దాల్చిన చెక్క వాటర్ గానీ, టీ గానీ వారానికి ఒకసారి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

78

షుగర్ పేషెంట్లకు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీన్ని భోజనం చేసే గంట ముందు  తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పరిగడుపున ప్రతిరోజూ టీస్పూన్ నానబెట్టిన మెంతులను గానీ, మెంతులతో తయారుచేసిన టీని గాని తాగితే వీరి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 
 

88

ప్రాణాయామం

షుగర్ పేషెంట్లు రెగ్యులర్ గా 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం వల్ల వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఎన్నో రోగాలు సైతం తగ్గిపోతాయి. ఓవర్ వెయిట్ కూడా తగ్గిపోతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంట్లోనే గాలిబెలూన్ రాకెట్ తయారు చేద్దాం.. మీ పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా
Recommended image2
Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో
Recommended image3
Saree Pin: చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి చీర పిన్ మనసు దోచే డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved