ఈ స్టైలిష్ లుక్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రెండ్ ఫాలోవ్వాలి కదా బాస్!
మెన్స్ స్టైలిష్ లుక్ కోసం రకరకాల డ్రెస్సులు ట్రై చేస్తూ ఉంటారు. కానీ అకేషన్ కు తగ్గట్టు రెడీ అయితేనే కదా హ్యాండ్సమ్ గా కనిపించేది. ప్రింటెడ్ కోట్ల నుంచి సింపుల్ టీ-షర్ట్‌ల వరకు ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటే స్టైలిష్ గా ఉంటారో ఒకసారి చూసేయండి.

సాధారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆడవాళ్లు ఎక్కువగా రెడీ అవుతుంటారు. మరి మగవారి సంగతేంటీ? మీరూ స్టైలిష్ గా కనిపించాలి కదా! మీరూ షాహిద్ కపూర్ ల స్టైల్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాలంటే ఈ ట్రెండీ లుక్స్.. ఒకసారి ట్రై చేయాల్సిందే.
మరింత గ్రాండ్ గా..
పెళ్లిళ్లు, పార్టీల కోసం ఇలాంటి స్టైలిష్ దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి మీ లుక్ ను మరింత గ్రాండ్ గా, రిచ్ గా మారుస్తాయి.
నగలతో జత చేస్తే..
కుర్తాను కొన్ని నగలతో జత చేయడం ద్వారా మరింత ప్రకాశవంతంగా కనిపించవచ్చు. ఈ లుక్ సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది. వివిధ సందర్భాలకు సరిపోతుంది. కంఫర్ట్ గా కూడా ఉంటుంది.
ప్రింటెడ్ కోట్..
ప్రింటెడ్ కోట్ తో మగవారు మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ డ్రెస్సులను ఫ్యామిలీ సమావేశాలు, ఆఫీస్ ఫంక్షన్ల కోసం ఈజీగా స్టైల్ చేయవచ్చు.
లైన్డ్ కోట్..
ఆఫీస్, పార్టీ దుస్తుల కోసం లైన్డ్ కోట్ ని ఎంచుకోవచ్చు. ఈ స్టైలిష్ కోట్లు రకరకాల రంగుల్లో లభిస్తాయి. ఇవి మీ లుక్ ను మరింత ఎలివేట్ చేస్తాయి.