MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Republic Day 2024: జెండాలో ఆ మూడు రంగుల చరిత్ర ఇది

Republic Day 2024: జెండాలో ఆ మూడు రంగుల చరిత్ర ఇది

Republic Day 2024: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా జెండాను ఎగురవేశారు. మన త్రివర్ణ పతాకం ప్రతి భారతీయ పౌరుడి గర్వానికి, గౌరవానికి చిహ్నం. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. త్రివర్ణ పతాకానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 26 2024, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
National Flag

National Flag

ఈ ఏడాది మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26 ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 1950 లో ఈ రోజు నాడే మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ సగర్వంగా భారత పతాకానికి సెల్యూట్ చేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జెండా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను  ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
National Flag

National Flag

1. త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల కారణంగానే జెండాను త్రివర్ణ పతాకమని అంటారు. జెండాలోని ప్రతి రంగుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. కాషాయం బలం, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఇక తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు సంపద, పచ్చదనాన్ని సూచిస్తుంది.
 

35
National Flag

National Flag

2. జెండాలో మధ్యలో ఉండే అశోక చక్రం చైతన్యానికి ప్రతీక. ఇది నీలం రంగులో ఉండటం వల్ల దీనిని ఆకాశం, నీటికి చిహ్నంగా భావిస్తారు. 

3. అశోకుడి రాజధాని సారనాథ్ లోని సింహ స్తంభంపై ఈ చక్రాన్ని చెక్కారు. దీనిలో 24 ఆకులు ఉంటాయి. 

4. త్రివర్ణ పతాకం వెడల్పు, పొడవు నిష్పత్తి 3:2. జెండాలోని మూడు రంగులు ఒకే సైజులో ఉంటాయి.
 

45
Indian National Flag

Indian National Flag

5. 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ పై జెండాను ఎగురవేశారు. అప్పుడు జెండా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నది. 

6. ప్రస్తుతం మనం ఎగురవేస్తున్న జెండాను 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకం రూపంలో ఆమోదించింది.

7. మన త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 1921లో రూపొందించారు.

55
National Flag

National Flag

8. త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ కూడా ఖాదీ, కాటన్ లేదా సిల్క్ తో తయారు చేస్తారు. 

9. మన దేశ రాజ్యాంగంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనే చట్టం అమలులో ఉంది. ఇది ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి వీలు కల్పిస్తుంది.

10. నడుము కింద.. త్రివర్ణ పతాకాన్ని వస్త్రంగా ధరించడం నిషిద్ధం.

11. త్రివర్ణ పతాకాన్ని చింపడం, మడతపెట్టడం, కాల్చడం, నేలపై విసిరేయడం కూడా నేరమే.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Henna: తెల్ల జుట్టు కవర్ చేయాలని హెన్నా పెడుతున్నారా? ఇలా చేస్తే మీకే నష్టం
Recommended image2
Mixer Grinder: మిక్సీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే పేలిపోతాయి జాగ్రత్త
Recommended image3
BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved