Telugu

Mixer Grinder: మిక్సీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే పేలిపోతాయి జాగ్రత్త

Telugu

జార్ ఓవర్ లోడ్ చేయడం...

మిక్సీ జార్ లో పదార్థాలను నిండుగా వేయకండి. దీని వల్ల మోటార్ పై ఎక్కువ ఒత్తిడి పడి, అది పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, హాఫ్ లోడ్ మాత్రమే వేయాలి. 

Image credits: GEMINI
Telugu

2. ఎక్కువసేపు ఆపకుండా తిప్పడం

మిక్సీని ఏకధాటిగా 3 నుంచి 5 నిమిషాల పాటు ఆన్ చేసి ఉంచొద్దు. దీనివల్ల మోటార్ వేడెక్కిపోతుంది. ప్రతి 30 సెకన్లకు ఒకసారి ఆపుతూ, '30 సెకన్ల రూల్' పాటించడం మంచిది.
Image credits: Amazon\Flipkart website
Telugu

3. ఎయిర్ వెంట్స్ బ్లాక్ అవ్వడం

మిక్సీ కింద వేడి గాలి బయటకు వెళ్లడానికి ఎయిర్ వెంట్స్ ఉంటాయి. దుమ్ము, ధూళితో ఇవి మూసుకుపోతే, మిక్సీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.
Image credits: Amazon\Flipkart website
Telugu

4. జార్ లీకేజీని పట్టించుకోకపోవడం

మిక్సీ జార్ నుంచి నీళ్లు లేదా జ్యూస్ లీక్ అవుతుంటే, అది మోటార్‌లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్ లేదా మంటలకు కారణం కావచ్చు. లీకేజీ కనిపిస్తే వెంటనే దాన్ని సరిచేయండి.
Image credits: Amazon\Flipkart website
Telugu

5. తప్పుడు సాకెట్ వాడకం

హై పవర్ మిక్సీలను నాసిరకం ఎక్స్‌టెన్షన్ బోర్డులలో అస్సలు వాడొద్దు. ఎప్పుడూ గోడకు ఉండే సరైన, సురక్షితమైన సాకెట్‌లోనే ప్లగ్ పెట్టండి.
Image credits: Amazon Website
Telugu

6. బ్లేడ్లు జామ్ అవ్వడం

జార్ బ్లేడ్లు సరిగ్గా తిరగకపోతే, మోటార్‌పై ఒత్తిడి పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు బ్లేడ్లను శుభ్రం చేయండి. అవి ఫ్రీగా తిరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోండి.
Image credits: Amazon Website
Telugu

7. దుమ్ము, ధూళి పేరుకుపోవడం

మిక్సీని వాడుతున్నప్పుడు మోటార్‌పై దుమ్ము, జిడ్డు పేరుకుపోతాయి. దీనివల్ల స్పార్కింగ్, ఓవర్‌హీటింగ్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే మిక్సీ మోటార్ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.
Image credits: Gemini

BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు

Cotton Kurta Sets: ఎవర్‍గ్రీన్ లుక్ కోసం బ్యూటీఫుల్ కుర్తా సెట్స్

Indoor Plants: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే 7 ఇండోర్ ప్లాంట్స్ ఇవే

Baby Boy Names: శ్రీవారి స్ఫూర్తితో చిన్నారుల కోసం అందమైన పేర్లు