Health Tips: మైక్రోవేవ్ లో వేడి చేసిన ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?
Health Tips: అన్నీ ఫాస్ట్.. ఫాస్ట్ గా పనులు జరిగిపోవాలనుకునే కాలం ఇది. అందుకే చాలా మంది తర్వగా వంట కావడానికి మైక్రోవేవ్ లను వాడుతున్నారు. అయితే మిగిలిపోయిన ఆహారాలను వీటిలో వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మైక్రోవేవ్ లను ఉపయోగించి వంట పనిని త్వరగా ఫినిష్ చేయొచ్చుు. అందుకే ఇప్పుడు చాలా మంది వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇది భోజనాన్ని వేడి చేయడానికి, ఏదైనా వంటకాన్నీ వేగంగా సిద్ధం చేస్తుంది. కానీ మైక్రోవేవ్ లో ఆహారాన్ని తిరిగి వేడి చేసే అలవాటు మంచిది కాదని పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని తేల్చి చెబుతున్నారు. ఇంతకి మైక్రోవేవ్ లో ఆహారాలను వేడి చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది: మైక్రోవేవ్ లో ఆహారాలను వేడి చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ తొలగిపోతాయి. వీటిని తిన్నా మీ శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు.
రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది: మైక్రోవేవ్ లో వండిన ఆహారాన్ని తినడం రక్త సీరం స్థాయిల (Blood serum levels) పై, శోషరస కణుపుల (Lymph nodes)పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. మైక్రోవేవ్ ఆహారాలు రోగనిరోధక వ్యవస్థతో సమస్యలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది: మీరు కూరగాయలను మైక్రోవేవ్ లో ఉంచితే అవసరమైన ఖనిజాలు, ఫ్రీ రాడికల్స్ గా మార్చబడతాయి. ఇది శరీరంలో క్యాన్సర్ కార్యకలాపాలకు దారితీస్తుంది. మైక్రోవేవ్ లో ఎలాంటి కూరగాయలను వేడి చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు కొన్ని తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు.
శరీరంపై తీవ్రమైన ప్రభావం: మైక్రోవేవ్ ఓవెన్ లో తయారు చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా లేదా శాశ్వత మెదడు దెబ్బతినే ప్రమాదముంది. మైక్రోవేవ్డ్ ఫుడ్స్ ను క్రమం తప్పకుండా తినడం ద్వారా పురుషుల్లో, ఆడవాళ్లలో హార్మోన్ల పెరుగుదల తగ్గడంతో పాటుగా అంతరాయం కూడా కలుగుతుంది.
ఎక్కువ ప్రయోజనాన్ని అందించదు: మీరు మైక్రోవేవ్ లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని వేడి చేసుకుని తింటున్నప్పటికీ.. ఇది మీ శరీరానికి పెద్దగా ప్రయోజనం కలిగించదు. బదులుగా ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ఇది కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల మీరు హడావిడిగా లేదా ఆలస్యంగా ఉన్నప్పటికీ ఆహారాన్ని గ్యాస్ స్టవ్ మీద వేడి చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.