MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హార్ట్ పేషెంట్లు ఇందుకోసమే ఓట్స్ ను తినాలని చెప్తారు..

హార్ట్ పేషెంట్లు ఇందుకోసమే ఓట్స్ ను తినాలని చెప్తారు..

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ వంటివన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇవి మన గుండెను రిస్క్ లో పడేస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2022, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో చాలా చిన్నవయసు వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇలాంటి వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే గుండె జబ్బులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మనం తినే ప్రతి ఆహారం మన గుండెపై ప్రభావాన్ని చూపెడుతాయి. అయితే ఓట్స్ మన గుండెను  ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

26

ఓట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కానీ దీని స్థాయిలు పెరిగిపోతేనే రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.  దీంతో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. ఓట్స్ β-గ్లూకాన్ (ఓబీజీ).  ఓట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.

36

ప్రతి 100 గ్రాముల వండని ఓట్స్ లో  390 కేలరీల శక్తి, 66 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 11.5 గ్రాముల డైటరీ ఫైబర్, 17 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే విటమిన్ బి 1, విటమిన్ బి5 లు కూడా ఎక్కవ మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు. 

46
oats

oats

ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పిల్లల్లో వచ్చే ఆస్తమా ప్రమాదాన్ని ఓట్స్ తగ్గించగలవు. అలాగే ఈ ఓట్స్ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే ఓట్స్ తో మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే చాలా సేపటి వరకు ఆకలిగా అనిపించదు. దీంతో మీరు ఓవర్ గా తినలేరు. ఇది మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తుంది. 

56

ఈ ఓట్స్ అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. దీంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి బ్లడ్ సర్కులేషన్ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. ఓట్స్ తో మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఓట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. 

66

ఓట్స్  రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి కూడా రక్షిస్తాయి. దీనిలో ఉండే కరిగే ఫైబర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. ఓట్స్ ను తింటే చర్మం కూడా అందంగా మెరిసిపోతుంది. అంతేకాదు చర్మ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image2
Gut Health: పేగుల ఆరోగ్యం కోసం ఈ 7 పండ్లు తినండి
Recommended image3
Coffee Sleepiness: కాఫీ తాగితే కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved