MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఉదయాన్నే కాదు.. భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

ఉదయాన్నే కాదు.. భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

చాలా మందికి ఉదయం పరిగడుపున లెమన్ వాటర్ ను తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది బరువు తగ్గడానికే ఈ వాటర్ ను తాగుతుంటారు. అయితే ఈ లెమన్ వాటర్ ను మీరు భోజనం చేసిన తర్వాత తాగితే ఏమౌతుందో తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 09 2024, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Lemon water

Lemon water

నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలని చాలా మంది ఉదయాన్నే పరిగడుపున లెమన్ వాటర్ ను తాగుతుంటారు. కానీ మీరు భోజనం చేసిన తర్వాత కూడా లెమన్ వాటర్ ను తాగొచ్చు. దీనివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

28

మెరుగైన జీర్ణక్రియ

తిన్న వెంటనే నిమ్మరసం తాగితే  మీ జీర్ణక్రియ బాగుంటుంది. నిమ్మరసం మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

38

పీహెచ్ బ్యాలెన్స్ 

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర pH స్థాయిని సమతుల్యం చేయడానికి బాగా సహాయపడుతుంది. తిన్న తర్వాత లెమన్ వాటర్ ను తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్య తగ్గిపోతుంది. 
 

48

రోగనిరోధక శక్తి, కొల్లాజెన్‌

నిమ్మకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని  కూడా పెంచుతుంది. తిన్న తర్వాత లెమన్ వాటర్ ను తాగితే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది.

58


యాంటీ ఆక్సిడెంట్లు 

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ నష్టం లేదా ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
 

68

ఉబ్బరం, వాపు

నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ.. ఇది గ్యాస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి  కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 

 

78

శరీరం డిటాక్సిఫై 

లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది మన శరీరం నుంచి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది  రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది.

88

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

రోజూ భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే .. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Chilli: పచ్చి మిర్చీ రోజూ తింటే ఏమౌతుంది..?
Recommended image2
Black Thread: చేతికి నల్లదారం కట్టుకుంటున్నారా? ఈ తప్పు మాత్రం చేయద్దు..!
Recommended image3
Royal Jhumka: రాయల్ జుంకాలు పెట్టుకుంటే ఆ అందమే వేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved