MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • 2023 లో ఏం చేసినా బరువు తగ్గలేదా? కారణం ఇదేకావొచ్చు..!

2023 లో ఏం చేసినా బరువు తగ్గలేదా? కారణం ఇదేకావొచ్చు..!

కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ 2023 ఏడాది కొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా బరువు తగ్గాలి? తగ్గేందుకు ఎంతో ప్రయత్నిస్తా అని.. 2023 స్టార్టింగ్ లో ప్లాన్స్ వేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇలా ప్లాన్స్ వేసుకుని బరువు తగ్గిన వారు ఎంత మంది ఉన్నారు? అయ్యో ఏడాది ఐపోవచ్చింది.. అయినా బరువు తగ్గలేదే అని బాధపడేవారు మనలో చాలా మందే ఉన్నారు. నిజానికి మీరు బరువు తగ్గకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 09 2023, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇయర్ ఎండింగ్ కు వచ్చేశాం. ఇక ఈ ఏడాది మొదట్లో ఏమేమి చేయాలనుకున్నాం.. వాటిలో ఏవి జరిగాయి? ఏవి జరగలేదో లెక్కలేసుకునే టైం వచ్చేసినట్టే. ఈ ఏడాది ముగుస్తుండటంతో కొత్త ఏడాదిలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే ముందు ఈ ఏడాదిలో మీరు అనుకున్నవన్నీ జరిగాయేమో చెక్ చేసుకున్నారా? మనలో చాలా మంది బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. మరి 2023లో ఖచ్చితంగా బరువు తగ్గాలని అనుకున్నవారు ఎంత మంది ఉన్నారు. మీరు నిజంగా బరువు తగ్గారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు. మరి మీరు ఎందుకు బరువు తగ్గలేదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Image: Getty

Image: Getty

వ్యాయామం చేయకపోవడం

రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఇది మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది మీ బరువు పెరగకుండా చూస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. అస్సలు పాజిబుల్ కాదు. మీరు ఎంత  గట్టిగా అనుకున్నా.. వ్యాయామం చేయకుండా ఇంచు బరువు కూడా తగ్గరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయండి.  

38
obesity

obesity

ఎక్కువగా తినడం 

బరువు తగ్గకపోవడానికి అసలు కారణం ఇదే. ఎక్కువగా తింటే మీరు ఏం చేసినా బరువు తగ్గరు. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది.  పలు అధ్యయనాల ప్రకారం.. మీరు తినే ఆహారాన్ని ట్రాక్ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. అతిగా తినడమంటే ఎక్కువగా, చాలా ఫాస్ట్ గా తినడం. మీ శరీర అవసరం కంటే ఎక్కువగా తిన్నారంటే పక్కాగా బరువు పెరుగుతారు. 
 

48
అధిక బరువు

అధిక బరువు

ఫాస్ట్ గా తినడం

ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తినడానికి కూడా టైం లేని వారు చాలా మందే ఉన్నారు. తినడానికి తక్కువ టైం ఉన్నవారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తింటుంటారు. కానీ ఇది కూడా మీ బరువును పెంచడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. బుద్ధిపూర్వకంగా తినడం వల్ల మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. మీ మెదడు పంపే సంకేతాలను గమనిస్తూ.. నెమ్మదిగా, పరధ్యానం లేకుండా తినడం, రుచిని ఆస్వాధిస్తూ తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. 
 

58
అధిక బరువు

అధిక బరువు

తగినంత ప్రోటీన్ తినడం లేదు

బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్ ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో అధ్యయనాలు కూడా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని వెల్లడించాయి. ప్రోటీన్ ఫుడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది పలు అధ్యయనాలు చెప్పాయి. ప్రోటీన్ ఫుడ్ కడుపును తొందరగా నింపుతుంది. ఇది మీరు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఊబకాయం ఉన్న పెద్దలలో అడపాదడపా ఉపవాసం ఉన్న సందర్భాల్లో ప్రోటీన్ తినడం ప్రభావం చూపకపోవచ్చు. అందుకే బరువు తగ్గడానికి ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.
 

68
అధిక బరువు

అధిక బరువు

చక్కెరను ఎక్కువగా తింటున్నారు

చక్కెరతో చేసిన ఆహారాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మీ బరువును అమాంతం పెంచుతాయి తెలుసా? అవును చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చక్కెర పానీయాల్లో కొవ్వును పెంచే అంశాలు ఉంటాయి. పండ్ల రసాలను కూడా ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా బయట దొరికే పండ్ల రసాలను తాగకపోవడమే మంచిది. పండ్ల రసాల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగినా మీరు బరువు పెరిగిపోతారు.
 

78

సరిగ్గా నిద్రపోవడం లేదు

పనిచేసినా.. చేయకున్నా.. మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం నిద్రవల్ల ప్రభావితం అవుతుంది. కంటినిండా నిద్రపోకపోవడం వల్ల కూడా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి కూడా. తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువ నిద్రపోవడం రెండూ ఊబకాయంతో సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి పెద్దలు ప్రతిరాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కౌమారదశలో 8–10 గంటలు, పిల్లలు, శిశువులు 9–16 గంటల పాటు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. ఫైనల్ గా చెప్పేదేంటంటే.. పేలవమైన నిద్ర కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది తప్ప  తగ్గడానికి కాదు. 
 

88
అధిక బరువు

అధిక బరువు

మీరు కార్బోహైడ్రేట్లను తగ్గించ లేదు

మీరు బరువు తగ్గడానికైనా, బయాబెటీస్ ఉన్నా, ప్రీడయాబెటీస్ ఉన్నా కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ శరీర బరువును పెంచడంతో పాటుగా షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీ ఆహారంలో పిండి పదార్ధాలను తగ్గిస్తే మీరు బరువు తగ్గే అవకాశం ఉంది. 2018లో జరిపిన ఒక ట్రయల్‌లో పోషకాలు ఎక్కువగా ఉండే, తక్కువ కొవ్వులు ఉన్న ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే, తక్కువ కార్బ్ డైట్ ఫలితాల్లో తక్కువ తేడా కనిపించింది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ooty Tour Package : ఊటీలో 3 రాత్రులు.. రైలు, హోటల్‌తో కలిపి ఒకే ప్యాకేజీ.. ఖర్చు ఎంతంటే?
Recommended image2
Silver Bracelet: బడ్జెట్ లో వెండి బ్రేస్లేట్... ఎంత క్యూట్ గా ఉన్నాయో
Recommended image3
Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved