రక్షా బంధన్ 2023: ఇలాంటి రాఖీలను అస్సలు కొనకండి
అన్నా చెల్లెలి మధ్య ప్రేమ, బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ ఇంది. అక్కా చెల్లెల్లు రాఖీ కడితే.. సోదరులు వారిని రక్షిస్తామని, వారి బాగోగులు చూసుకుంటామని వాగ్దానం చేస్తారు. అయితే రాఖీ కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.

rakshabandhan 2023
ఈ నెల అంటే ఆగస్టు 31న రాఖీ పండుగను జరుపుకోబోతున్నాం. రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది రాఖీలను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఇప్పటి నుంచే రాఖీలను కొంటుంటారు. అయితే ఈ రాఖీలను కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలంటున్నారు జ్యోతిష్యులు.
ప్రతి ఏడాది రాఖీ పండుగను శ్రావణమాసంలోని పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అంటే ఆగస్టు 30 న వచ్చినా.. ఆ రోజు భద్రకాలం కారణంగా రాఖీ పండుగను 30, 31 తేదీల్లో జరుపుకుంటారు.
రాఖీ ఒక దారం మాత్రమే కాదు.. ఇది వారి ప్రేమకు చిహ్నం. ఈ పండుగను పురాతన కాలం నుంచి జరుపుకుంటున్నారు. అయితే ఒకప్పుడు రాఖీలను బలమైన పట్టు దారంతో తయారుచేసేవారు. ఇప్పుడు రంగురంగుల, భిన్నమైన రాఖీలను తయారుచేస్తున్నారు.
ఖరీదైన, అందంగా కనిపించే రాఖీలనే కొనడానికి ప్రయత్నిస్తుంటారు. మార్కెట్ లో ఎన్నో రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. ఇవి చూడటానికి అందంగా కనిపిస్తాయి. కానీ జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాఖీలను అన్నా తమ్ముల్లకి కట్టకూడదు. రాఖీలను కొనేటప్పుడు ఎలాంటి విషయాలను గుర్తించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాఖీలను కొనకూడదు
ప్రస్తుత కాలంలో కార్టూన్ క్యారెక్టర్లతో తయారుచేసిన రాఖీలను కూడా అమ్ముతున్నారు. నిజానికి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి మంచివి కావని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలాంటి రాఖీలను కడితే మీసోదరుడి జీవితంలో నెగిటివిటీని తీసుకొస్తాయి. అందుకే ఇలాంటి వాటిని కొనకండి.
నల్ల రంగు రాఖీలు
హిందూ మతంలో నలుపు రంగును అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే నలుపు రంగును ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే మీ సోదరుడికి ఇలాంటి నలుపు రంగు ఉన్న రాఖీలను కట్టకండి. వీటిని అసలే కొనకండి.
దేవత బొమ్మతో రాఖీ
అయితే చాలా మంది దేవత బొమ్మ ఉన్న రాఖీలను శుభప్రదంగా భావిస్తారు. కానీ ఇలాంటి రాఖీలను కొనకూడదు. ఎందుకంటే రాఖీలను చాలా కాలం పాటు చేతికే ఉంచుకుంటారు. అయితే దేవత బొమ్మ ఉన్న రాఖీలను చాలా కాలం కట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవుతాయి. ఒక్కోసారి అవి విరిగిపోవచ్చు. ఎక్కడైనా పడొచ్చు. ఇది దేవుడిని అవమానించినట్టేనంటున్నారు జ్యోతిష్యులు. అందుకే ఇలాంటి రాఖీలను కొనకండి.
rakshabandhan 2023
విరిగిన రాఖీలు
కొన్ని సార్లు రాఖీలు ఏదో ఒక కారణం వల్ల విరిపోతాయి. ఇలాంటి రాఖీలను కొంతమంది అలాగే కడుతుంటారు. కానీ రాఖీలు విరిగిపోకూడదు. ఎందుకంటే విరిగిన రాఖీలు శుభకార్యాలకు మంచివి కావు.