- Home
- Life
- షుగర్ పేషెంట్లకు ఈ పిండి అమృతం.. ఇది షుగర్ లెవెల్స్ ను నియంత్రించి,.రక్తపోటు,ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది
షుగర్ పేషెంట్లకు ఈ పిండి అమృతం.. ఇది షుగర్ లెవెల్స్ ను నియంత్రించి,.రక్తపోటు,ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది
షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు వీరి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.

ఊబకాయులు ఏ విధంగా అయితే పెరిగిపోతున్నారో.. షుగర్ పేషెంట్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నారు. ఊబకాయాన్ని ఎలాగోలా తగ్గించుకోవచ్చు కానీ.. షుగర్ వ్యాధిని మాత్రం ఏం చేసినా తగ్గించుకోలేము. ఒక్క సారి దీని బారిన పడ్డామంటే..మనం చనిపోయేంత వరకు ఇది మనతోనే ఉంటుంది. దీనిని పూర్తిగా తగ్గించే చికిత్స ఇంకా అందుబాటులోకి రాలేదు.
అందుకే మధుమేహులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరి రక్తంలో షుగర్ స్థాయిలు అదుపు తప్పితే.. ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాగి పిండి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది.
సాధారణంగా ఈ రోజుల్లో జొన్న రొట్టెలకు బదులుగా గోధుమ రొట్టెలను తినే వారు ఎక్కువ అయ్యారు. ఇందులో షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు. మధుమేహులకు గోధుమ రొట్టెల కంటే రాగిపిండితో చేసిన రొట్టెలే ఎంతో మేలు చేస్తాయి. ఈ రాగి రొట్టెలు కేవలం డయాబెటీస్ పేషెంట్లకే కాదు అధిక రక్తపోటు, ఊబకాయులకు కూడా మంచివి. ఇవి ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మధుమేహుల ముందున్న అతిపెద్ద సమస్య రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఎలా నియంత్రించాలి. ఆ మాత్రం ఆలోచించకుండా ఏవి పడితే అవి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మధుమేహులు రాగిపిండి రొట్టెలను తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహులకు రాగులు ఏ విధంగా మేలు చేస్తాయి..
రాగుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహార పదార్థాలను తొందరగా అరిగేలా చేస్తుంది. రాగులు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి. ఎలా అంటే.. వీటిని తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
రాగుల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి.
రాగులు ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తాయి. రాగులను తరచుగా తింటే శరీరంలో రక్తానికి కొదవ ఉండదు. రాగులతో రొట్టెలు, దోశలు , స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.