- Home
- Life
- బీపీ, షుగర్ పేషెంట్లకు ముల్లంగి మంచి మెడిసిన్ లాంటిది? ఈ కూరగాయ ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా..?
బీపీ, షుగర్ పేషెంట్లకు ముల్లంగి మంచి మెడిసిన్ లాంటిది? ఈ కూరగాయ ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా..?
హైబీపీ, షుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే ఎన్నో ప్రాణాంతక రోగాలొస్తాయి. అయితే వీరికి ముల్లంగి ఎంతో ప్రయోజనరకంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాల ముప్పు తప్పుతుంది.

కొన్ని రకాల కూరగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. ఎందుకంటే ఇవి ఎన్నో రోగాలను నియంత్రిస్తాయి. మరెన్నో రోగాల ముప్పును తప్పిస్తాయి. ఇవి మెడిసిన్స్ కంటే తక్కువేం కాదు. ముఖ్యంగా సీజన్ లో పండే కూరగాయలను తప్పకుండా తినాలి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఫ్లూలు రాకుండా చూస్తాయి. ఈ సీజన్ లో ముల్లంగిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ కూరగాయ హైబీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను నివారించడానికి సహాయపడుతుంది. ముల్లంగిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ముల్లంగిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిని తినడం వల్ల క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగి వంటి క్రూసిఫరస్ కూరగాయలను నీటిలో కలిపితే ఐసోథియోసైనేట్ లుగా విచ్చిన్నమయ్యే సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. ఐసోథియోసైనేట్లు క్యాన్సర్ కణితులు పెరుగుదలను నివారించడానికి సహాయపడతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ముల్లంగిలో ఉండే ఔషద గుణాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ముల్లంగిలో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అడిపోనెక్టిన్ అనే పిలిచే హార్మోన్ ను నియంత్రిస్తాయి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ విధంగా ముల్లంగి మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది
ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ముల్లంగిలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఇది రక్తప్రసరణ, రక్తపోటును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ముల్లంగి జీర్ణిక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో కరిగే, కరగని ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముల్లంగి తినడం వల్ల మలబద్దకం, అజీర్థి సమస్యలు పోతాయి.