జుట్టు ఇందుకోసమే రాలిపోతుందా..?
Hair fall: జుట్టు ఇతర కారణాలతో పాటుగా.. శరీరక, భావోద్వేగ ఒత్తిడి వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక దీన్ని ఆపడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్ ను షాంపూలను ఉపయోగిస్తారు. ఏవి పడితే అవి జుట్టును పెట్టడం వల్ల జుట్టు మరింత దెబ్బతిని మరింత ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సహజమే. ఇంతకు మించి ఊడిపోతేనే దానికి కారణాలుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
hair fall
హార్మోన్లలో మార్పులు రావడం వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. రుతువిరతి, థైరాయిడ్ సమస్యల కారణంగా హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. దీనివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.
శరీరక, మానసిక ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్య తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. కొన్ని నెలల తర్వాత జుట్టు మళ్లీ లావుగా మారుతుంది. అది కూడా ఒత్తిడి పూర్తిగా పోతేనే.
మనం తీసుకునే ఆహారం కూడా జుట్టుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు, అధిక గ్లైసెమిక్ కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నా.. వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతాయి.
hair fall
పోషకాహార లోపం కారణంగా కూడా జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇనుము, కొన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు శరీరంలో లోపిస్తే జుట్టు ఊడిపోతుంది.
వీటితో పాటుగా కొన్ని రకాల మందు బిల్లలు కూడా జుట్టుపై చెడు ప్రభావాలను చూపిస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, క్యాన్సర్, గౌట్ వంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు వాడే మందులు జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.
అంతేకాదు.. జుట్టును గట్టిగా లాగినా.. బిగుతుగా ముడి వేసినా.. Cornrows వంటి కేశాలంకరణల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.