Pregnancy Tips: కడుపుతో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..
Pregnancy Tips: గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారంతోనే కడుపులో బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి.

Pregnancy Tips: ఇతరులకంటే గర్భిణులు ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తినాలి. ఎందుకంటే ఈ ఆహారంతోనే కడుపులో ఉండే బిడ్డ ఎదుగుదల, మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది.
బిడ్డ ఎదుగుదలకు విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. గర్భిణులుగా ఉన్న సమయంలో చాలా మంది ఆడవారు ఎక్కువగా విటమిన్ ఎ, సి ఉన్న ఆహారాలనే తింటూ ఉంటారు. వీటితో పాటుగా విటమిన్ డి కూడా ఎంతో అవసరం. గర్భాధారణలో విటమిన్ డి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
రక్తంలోని కాల్షియం, భాస్వరం సమతుల్యంగా ఉండటానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి వల్ల దంతాలు, ఎముకలు బలంగా, ధ్రుండంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రిస్తుంది.
గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే వారిలో విటమిన్ డి లోపించకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది కాబట్టి.
విటమిన్ డి లోపం ఏర్పడితే.. ఎముకలు బలహీనంగా మారి నొప్పి పుట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా కడుపులో ఉండే బిడ్డ ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయి. మీకు తెలుసా.. విటమిన్ డి లోపిస్తే బిడ్డ బరువు తగ్గే ప్రమాదం ఉంది.
చాలా మటుకు స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు వారు రోజూ ఉదయం పూట ఒక అర్థగంట పాటు ఎండలో కూర్చోవాలి. దానివల్ల మీ శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి లభిస్తుంది.
సన్ స్క్రీన్ ను ఎక్కువగా వాడినా, విటమిన్ డి ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోకపోయినా,స్కిన్ పిగ్మెంటేషన్ వాడినా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
గర్భం ధరించనప్పటి నుంచి డెలివరీ వరకు ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వాలి. పౌష్టికాహారం తీసుకున్నప్పుడే తల్లీ బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. పోషకవిలువలున్న ఆహారం తీసుకుంటే ప్రెగ్నెంట్ గా ఉన్నసమయంలో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు.
Pregnancy
విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫ్లూయడ్స్, మినరల్స్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ మీ రోజు వారి ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. ఇందుకు తగ్గట్టుగా ఒక చార్ట్ ను తయారుచేసి పెట్టుకోండి. దీనివల్ల టైం టూ టైం మీరు పోషకాలను తీసుకుంటారు. ఇవన్నీ తింటే బరువు పెరుగుతామని టెన్షన్ పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ కామన్ గా వెయిట్ పెరుగుతుంటారు మరి.