ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ సేపు నిలబడితే ఏమౌతుందో తెలుసా?
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఏ పొజీషన్ లో ఎక్కువ సేపు ఉండలేరు. అసలు ఎక్కువ సేపు ఒకే పొజీషన్ లో ఉండటం మంచిది కాదు కూడా. అయితే కొంతమంది గర్బిణులు ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తుంది. ముఖ్యంగా జాబ్స్ చేసే వారు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..
![article_image1](https://static-gi.asianetnews.com/images/01fw6dy633c7vhxaqbv5nmjkv1/pregnancy-maternity_380x253xt.jpg)
గర్భధారణ సమయంలో ఆడవాళ్లు చాలా చురుకుగా ఉండాలి. ముఖ్యంగా వీళ్లు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే పొజీషన్ ఎక్కువ సేపు ఉండకూడదు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సేపు నిలబడితే.. శిశువు పరిమాణం, పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. అందుకే గర్భధారణ సమయంలో ఒకేచోట నిలబడకుండా నడవడం, లేదా పొజీషన్ ను మార్చడం మంచిది. ఒకవేళ ఎక్కువ సేపు నిలబడితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
![article_image2](https://static-gi.asianetnews.com/images/01frqbdf4ydrtx5f6e3phn1rxs/linea-nigra-what-is-that-dark-line-and-will-it-ever-go-away-pregnancy-post-by-mama-natural-jpg_380x213xt.jpg)
గర్భధారణ సమయంలో ఎక్కువసేపు నిలబడటం వల్ల వెన్నునొప్పి కలగుతుంది. అలాగే శిశువు పెరుగుదలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ ప్రమాదాలు రాకూడదంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా డాక్టర్ ను సంప్రదించాలి.
Pregnancy
గర్భధారణ సమయంలో ఎక్కువసేపు నిలబడటం సురక్షితమేనా?
గర్భధారణ సమయంలో ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్ళు విపరీతంగా నొప్పి పెడతాయి. అలాగే వెనుక భాగంలో భరించలేని నొప్పి కూడా కలుగుతుంది. దీనివల్ల పిండానికి రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కడుపులోని బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉండదు. పలు అధ్యయనాలు వారానికి 25 గంటలకు పైగా నిలబడటం వల్ల 148-198 గ్రాముల తక్కువ బరువు ఉన్నపిల్లలు పుడతారని వెల్లడిస్తున్నాయి. అంతేకాదు దీనివల్ల పిల్లల ఎత్తు కూడా బాగా తగ్గుతుందట.
గర్భధారణ సమయంలో ఎంతసేపు నిలబడటం సేఫ్?
గర్భధారణ సమయంలో.. మీకు ఎలాంటి సమస్య లేకుంటే కొద్ది సేపు నిలబడొచ్చు. అంటే కాళ్లు , వెన్నునొప్పి వచ్చే వరకు నిలబడొచ్చన్న మాట. అయితే కొన్ని కారణాల వల్ల ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తే మాత్రం కాళ్లను ఊపడం మంచిది. ఒకే దగ్గర నిలబడకుకండా కొద్దిసేపు నడవండి. లేదా మీ పాదాలను స్టూల్ మీద కొద్ది సేపు పెట్టండి.
pregnancy
ఎడెమా
ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్లలో వాపు రావడం సర్వ సాధారణ సమస్య. అయితే ప్రెగెన్సీ సమయంలో మరీ ఎక్కువసేపు నిలబడటం వల్ల శరీరంలోని అదనపు నీరంతా కాళ్లలోకి వచ్చి పేరుకుపోతుంది. దీనివల్లే కాళ్లు వాపు వస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సేపు నిలబడటం వల్ల తీవ్రమైన కటి నొప్పికి కారణమయ్యే సింఫిసిస్ పుబిస్ పనిచేయకపోవడం (ఎస్పిడి) సమస్య కలగొచ్చు. ఎక్కువ సేపు నిలబడటం.. ముఖ్యంగా ఒక కాలుపై నిలబడితే జఘన నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
pregnancy
దిగువ వీపులో నొప్పి
ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సేపు నిలబడటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో ఒకటి వెన్నునొప్పి. ఈ నొప్పి కాలు, మడమ వరకు వ్యాప్తిస్తుంది.
రక్తపోటులో మార్పు
ఎక్కువ సేపు నిలబడటం వల్ల రక్తపోటు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే దీనివల్ల రక్తపోటు విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీకు రక్తపోటు తక్కువగా ఉంటే ఎక్కువ సేపు నిలబడితే మగత అనిపించొచ్చు.
అకాల పుట్టుక
గర్భిణులు దీర్ఘకాలం పాటు నిలబడుతూ ఉంటే.. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలు డెలివరీ సమయం కంటే ముందుగానే పుట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వారు పెరిగే ముందు ప్రసవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.