parenting tips: ఇట్లుంటే కూడా పిల్లలు పుట్టరు..!
parenting tips: చాలా మంది భార్యా భర్తలు వాళ్ల కెరియర్ వల్లో, చదువుల కారణంగానో పిల్లలను అప్పుడే వద్దనుకుని ప్రెగ్నెన్సీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ జాగ్రత్తలు ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం పిల్లలు పుట్టడం అసాధ్యం అవుతుంది.
parenting tips: పెళ్లైన ప్రతి జంట పిల్లలను తొందరగా కని వారిని పెంచి పెద్దచేయాలని భావిస్తూ ఉంటారు. అయితే వారి కెరియర్ ప్లానింగ్ కారణంగానో, చదువు వల్లో, లేకపోతే ఇప్పుడే పెళ్లైంది అప్పుడే పిల్లలు ఎందుకనో చాలా మంది ప్రెగ్నెన్సీ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ జాగ్రత్తలు అలాగే ఎక్కువ కాలం తీసుకుంటే మాత్రం పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తగ్గుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సరైన వయస్సులో పిల్లల్ని కనకపోతే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే వయసుతో పాటుగా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గిపోతుందట.
పిల్లల్ని కనగడానికి సరైన ఏజ్ 35 లోపే. ఈ వయసుకు కంటే తక్కువ ఏజ్ లోనే పిల్లల్ని కనే ప్లానింగ్ ను చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం చాలా మంది అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైపర్ టెన్షన్, మధుమేహం, ఒబెసిటీ వంటి సమస్యల కారణంగా కూడా ఫర్టిలిటీపై ప్రభావం పడి ప్రెగ్నెన్సీ రాదని పేర్కొంటున్నారు.
హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడం. పిసిఓస్, Fallopian tubes మూసుకుపోవడం, కాలుష్యం , పెల్విక్ ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల సంతానలేమి (Infertility) సమ్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఒత్తిడి సమస్య కూడా సర్వసాధారణమైపోయింది. ఈ సమస్య మగవారిలోనే కాదు ఆడవారిలో కూడా ఉంది. దీనివల్ల కూడా సంతానలేమి సమస్య వస్తుంది. ఒత్తిడి కారణంగా పురుషుల్లో Testosterone levels లో మార్పులు వస్తున్నాయి. అంతేకాదు ఇది స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒత్తిడి కారణంగా ఆడవారిలో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్యానికి గురి చేసే బ్యాడ్ హాబిట్ల మూలంగా కూడా ఈ సమస్య తలెత్తే అవకాశముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్ల కారణంగా కూడా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
sperm
బ్యాడ్ హాబిట్స్ వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతినడంతో పాటుగా రిప్రొడక్టివ్ ఆర్కాన్స్ డ్యామేజ్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక మహిళల్లో ఎగ్ క్వాలిటీ తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్ తినడం, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాదు.. సంతానలేమి సమస్యలు కూడా తలెత్తుతాయి.
infertility
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయట. దీంతో పురుషుల్లో శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది. మన ఆరోగ్యం బాగుండాలన్నా, సంతానలేమి సమస్యలు తలెత్తకూడదన్నా.. మన లైఫ్ స్టైల్ ఆరోగ్యకరమైనదై ఉండాలని వైద్యులు చెబుతున్నారు.