ఈ సింపుల్ టెక్నిక్స్ తో కరెంట్ బిల్ ను తగ్గించుకోవచ్చు..
సమ్మర్ రాకతో కరెంట్ బిల్ మోత మోగుతుందనే చెప్పాలి. ఈకాలంలో ఇంట్లో ఫ్యాన్లకు, ఏసీలకు, ఫ్రిజ్ లకు, కూలర్ లకు ఎక్కువగా పని చెప్తుంటారు. ఇంకేముంది దీంతో మీ కరెంట్ బిల్లు మునుపెన్నడూ లేనంతగా వస్తుంది. మరి ఈ బిల్లును కొన్ని సింపుల్ టెక్నిక్స్ తో తగ్గించొచ్చు. అదెలాగంటే..

ఇతర కాలాలకంటే వేసవిలోనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని అందరికీ తెలిసిందే. ఎందుకంటే భానుడి సెగ నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో ఉండే ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్ లు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. దాంతో మీ పవర్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ను ఫాలో అయితే కరెంట్ బిల్లును సులభంగా తగ్గించొచ్చు.
స్మార్ట్ డివైట్ లు: మీ ఇంట్లో పాత ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. వాటి ప్లేస్ లో స్మార్ట్ డివైజ్లను ఏర్పాటు చేయండి. దీనివల్ల ఎలక్ట్రిక్ వాడకం తగ్గుతుంది.
ఇవి కూడా: మీ ఇంట్లో పాత ఎలక్ట్రిక్ బల్బులకు బదులుగా స్మార్ట్ బల్బులను, స్మార్ట్ టీవీలను, స్మార్ట్ స్పీకర్లు ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇవి విద్యుత్ ను తక్కువగా గ్రహిస్తాయి.
ఈ బల్బులను వాడకండి: ఇప్పుడంతా ఎల్ ఈడీ బల్బుల కాలం నడుస్తోంది. ఒక వేళ మీ ఇంట్లో సీఎఫ్ ఎల్ లేదా పాత ఫిలమెంట్ బల్బులు గనుక ఉంటే వాటిని వెంటనే తీసేసి ఎల్ ఈడీ బల్బులను పెట్టండి. ఎందుకంటే ఎల్ ఈడీ బల్బులు విద్యుత్ ను చాలా తక్కువగా వినియోగిస్తాయి.
రేటింగ్ ఇంపార్టెంట్: ప్రస్తుతం ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొన్నా.. ముందుగా వాటి రేటింగ్ యే చూస్తున్నారు. రేటు ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత విద్యుత్ ను ఆదా చేస్తాయని అర్థం. కాబట్టి మీరు ఏసీ, ఫ్రిజ్ లాంటివి కొనాలనుకుంటే ముందుగా వాటి రేటింగ్ ను చూసి కొనండి.
అవసరం లేకుంటే: అవసరం లేకున్నా ఛార్జింగ్ సాకెట్స్ ను ఆన్ లోనే ఉంచితే విద్యుత్ ఎక్కువగా వినియోగించబడుతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయండి.
టెంపరేచర్ : విద్యుత్ ను సేవ్ చేయాలంటే మీ ఏసీని ఎల్లప్పుడూ 24 డిగ్రీల Temperature వద్దే ఉంచండి. దీనివల్ల పవర్ ను చాలా వరకు సేవ్ చేసినవారవుతారు. ఒకవేళ Temperature తగ్గితే మాత్రం కరెంట్ ఎక్కువగా వినియోగించబడుతుంది. దీంతో మీకు కరెంట్ బిల్లు మోత మోగుతుంది.
స్విచ్ ఆఫ్: అవసరం లేకున్నా బల్బులు , ఫ్యాన్లు వేసి ఉంటే విద్యుత్ ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి.