White Hair: ఒక్క తెల్ల వెంట్రుక పీకేసినా.. జుట్టంతా తెల్లగవుతుందా?
White Hair: హే వద్దురా.. ఒక్క తెల్ల వెంట్రుక పీకేసినా.. నీ జుట్టంతా తెల్లగా అవుతుంది. కాబట్టి ఒక్క వెంట్రకను కూడా పీకేయకు.. అని తెల్ల వెంట్రుకలు పీకేసే వారికి కొంతమంది సలహాలనిస్తుంటారు.

ఒకప్పుడు తెల్లజుట్టు వయసు మీద పడుతున్న వారికే వస్తుండేది. ఒక రకంగా చెప్పాలంటే తెల్ల వెంట్రుకలు ముసలితనానికి గుర్తుగా వచ్చేవి. ఇప్పుడు కాలం మరింది. కాలంతో పాటుగా ఎన్నో విషయాలు కూడా మారాయి. తెల్ల వెంట్రుకలు ముసలోళ్లకే వస్తాయనుకోవడం పొరపాటుగా తయారయ్యింది.
ముసలోళ్లకే కాదు వయసులో ఉన్న , చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. జుట్టులోంచి ఒక్క తెల్లవెంట్రుకను పీకినా.. జుట్టంతా తెల్లగా మారిపోతుందని బయపెట్టిస్తుంటారు. కానీ అదంతా వట్టి అబద్దమేనని నిపుణులు తేల్చారు. ముఖ్యంగా దీనికి ఎలాంటి సైటిఫిక్ రీజన్స్ కూడా లేవట.
జుట్టు నల్లగా, తెల్లగా ఉండాలన్న విషయాన్ని నిర్ణయించేది మాత్రం మెలనిన్ యే. తెల్లజుట్టులో ఈ వర్ణద్రవ్యం అసలే ఉండదు. నల్ల వెంట్రుకలలోనే ఇది ఉంటుంది. ఇక ఈ వర్ణద్రవ్యం గోధుమ రంగు వెంట్రుకల్లో సగం శాతం మంత్రమే ఉంటుంది. మెలనిన్ కుదుళ్ల ఉపరిత స్కిన్ పై ఉత్పత్తి అవుతుంది.
ఈ మెలనిన్ రిలీజ్ అయిన తర్వాత అది నేరుగా వెంట్రకల గొట్టాల్లోకి వెల్లి నిల్వ ఉంటుంది. ఈ కారణంగానే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. కొన్ని సార్లు కొన్ని వెంట్రుకల వద్ద ఈ వర్ణద్రవ్యం(మెలనిన్) తగినంత ఉత్పత్తి కాదు. దాంతో వెంట్రుకలు తెల్లగా లేదా గోధుమ రంగుగా మారుతాయి.
ఇక ముసలి వాళ్లలో జుట్టు తెల్లబడటానికి ఒక కారణం ఉంది. ముసలి వాల్లలో జుట్టును నల్లబరిచే మెలనిన్ ఉత్తత్తి తగ్గుతుంది. దాంతోనే అమ్మమ్మలకు, తాతలకు తెల్లవెంట్రుకలు వస్తాయి.
డెర్టటాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. ఒక్క తెల్లవెంట్రుకను పీకేసినా.. ఎక్కువ మొత్తంలో తెల్ల వెంట్రుకలు రావని చెబుతున్నారు. మెలనిన్ ఉత్పత్తి సరిపడా ఉత్పత్తి కాకపోతేనే తెల్ల వెంట్రుకలు వస్తాయి. బహుషా ఒకే ప్లేస్ లో తెల్లవెంట్రుకలు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్లే ఈ అభిప్రాయం కలగొచ్చు. కానీ అక్కడి వెంట్రెకలకు మెలనిన్ అందకపోవడం వల్లే అలా మారాయని అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క వెంట్రకను పీకేసినందుకే తెల్లవెంట్రుకలు వచ్చాయనడంలో ఎలాంటి నిజం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే.
పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు వారి జుట్టంతా తెల్లగా నెరసిపోయి ఉంటుంది. దానికి కూడా కారణం ఉంది. పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతికి తెల్ల జుట్టుకు సంబంధమేంటని మీకు డౌట్ రావొచ్చు. అయితే సూర్యకాంతి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల కూడా జుట్టు నల్లగా మారుతుందట. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి తక్కువ మొత్తంలో ఉండటం వల్ల తెల్లజుట్టు నల్లజుట్టు మిక్స్ చేసినట్టుగా, గోధుమ రంగు లేదా పూర్తిగా తెల్ల జుట్టు కూడా ఉంటుంది. ఇదంతా మెలినిన్ తక్కువ మొత్తంలో రిలీజ్ అవడమే కారణం.