Pineapple Side Effects: పైనాపిల్ ను ఎక్కువగా తింటే ఇన్ని రోగాలొస్తాయా?
Pineapple Side Effects: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రోగాలు కూడా నయమవుతాయి. అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. అందులో మీరు పైనాపిల్ ను ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను మీరు తెలుసుకోవాల్సిందే.

Pineapple
ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేయడానికి కూడా ఎంతో సహాయపడతాయి. అందులోనూ వేసవిలో నీటి క్వాంటిటి ఎక్కువగా కలిగి ఉండే పైనాపిల్ పండును తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
ఈ పండును కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో జ్యూస్ గా చేసుకుని తాగితే.. మరికొంతమంది మాత్రం స్నాక్స్ గా తినడానికి ఇష్టపడుతుంటారు. పైనాపిల్ వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలా అని ఈ పండును అధికంగా తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ గా పండును తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. కానీ అదే పనిగా తింటే మాత్రం మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువ అవుతుంది. దీంతో మీరు వాంతులు, గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
డయాబెటీస్ పేషెంట్లు పైనాపిల్ ను తీసుకోకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది తింటే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
pineapple fruit
మరీ తీయగా ఉండే పండ్లు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందులో పైనాపిల్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మోతాదుకు మించి తింటే దంతాల సున్నితత్వం దెబ్బతింటుంది. అంతేకాదు కావిటీ సమస్యలు కూడా తలెత్తొచ్చు. అందుకే దంత సమస్యలు ఉన్నవారు పైనాపిల్ ను తీసుకోకపోవడమే బెటర్.
పైనాపిల్ ను మోతాదుకు మించి తింటే గొంతు నొప్పితో పాటుగా అలెర్జీ కూడా కలగొచ్చు. పై లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.