Oversleeping: 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే ఎన్ని రోగాలొస్తాయో తెలుసా..?
Oversleeping: శరీర అలసట తీరడానికి నిద్ర ఎంతో అవసరం. అయితే 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, మెమోరీ పవర్ తగ్గడం, మధుమేహం, తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలసి సొలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. పొద్దంతా కష్టం చేసిన శరీరానికి నిద్రతోనే విశ్రాంతి కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే నిద్రపోవడంలో తప్పు లేదు కానీ .. అతిగా నిద్రపోతేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
బరువు పెరుగుతారు.. రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బరువును నియంత్రించాలంటే మాత్రం మీరు రోజుకు అవసరమైన నిద్రను మాత్రమే పోవాలి.
గుండె జబ్బులు.. కంటికి సరిపడా నిద్రకంటే ఎక్కువ సేపు పడుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పలు అధ్యయనాల ప్రకారం.. హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయే వారిలో 34 శాతం మంది ఎక్కువ సేపు పడుకోవడం వల్లే చనిపోయారు. కాబట్టి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు పడుకోకండి.
మెదడు సామర్థ్యం తగ్గుతుంది.. నిత్యం ఎక్కువ సేపు పడుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుందట. ముఖ్యంగా దీనివల్ల మెమోరీ పవర్ కూడా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
తలనొప్పి.. అవసరానికి మించి ఎక్కువ సేపు పడుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు పడుకుంటే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
డయాబెటీస్.. 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువ సేపు పడుకునే వారే ఎక్కువగా మధుమేహం బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా అతినిద్ర హార్మోన్లను అసమతుల్యంగా చేస్తుంది. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది.
మానసిక ఒత్తిడి.. ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మానసిక ఒత్తిడి సమస్య తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోకండి.