Coronavirus: రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులకే కరోనా రిస్క్ ఎక్కువ..
Coronavirus: కరోనా వైరస్ ఇప్పట్లో వదిలిపోదని దాని కొత్త కొత్త రూపాలను చూస్తేనే అర్థమవుతోంది. ఈ మహమ్మారి నుంచి నుంచి తప్పించుకునేందుకు టీకాలు ఎంతో సహయపడతాయి. అలాగే రోగ నిరోధక కూడా ఎంతో అవసరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికే కరోనా రిస్క్ ఎక్కువని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

Coronavirus: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కనిపించని కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్నాయి. దీన్ని తరిమికొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఈ వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ ఎంతో మంది ప్రజల ప్రాణాలు తీస్తోంది. అయితే కరోనా సోకిన కొంతమంది వ్యక్తుల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటే.. మరికొంతమంది వ్యక్తుల్లో మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.
కొంతమంది కోవిడ్ సోకిన వాళ్లు తొందరగా కోలుకుంటే మరికొంత మంది మాత్రం దీర్థకాలిక లక్షణాలతో బాధపడుతూనే ఉన్నారు. అయితే పలు ఆరోగ్య సంస్థలు.. కోవిడ్ ఎక్కువగా ఎవరికి సోకుంతుందోనన్న విషయాన్నిగుర్తించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization),Centers for Disease Control.. 60 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా కోవిడ్ బారిన పడే ప్రమాదముందని ప్రకటించాయి. వీళ్లకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉండటమే కాదు.. సంక్రమణ కూడా తీవ్రంగా ఉండనుందని తేల్చి చెబుతున్నాయి.
ఇమ్యూనో కాంప్రమైజ్డ్ గా ఉండటం అంటే.. రోగ నిరోధక వ్యవస్థ మనల్ని ఎన్నో రోగాల నుంచి బయటపడేయగలదు. ఎన్నో వ్యాధులు సోకకుండా కాపాడగలదు. ఇది వైరస్, బ్యాక్టీరియా, పరాన్న జీవులతో పోరాడుతుంది. సరిగ్గా పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ ప్రమాదకరమైన రోగాలను నివారించగలదు. అదే రాజీ పడే రోగ నిరోధక వ్యవస్థ అయితే మన శరీరాన్ని ఆక్రమించే వైరస్ లను, బ్యాక్టీరియాను ఎదుర్కోలేదు. మనల్ని రక్షించలేదు. అంటే రాజీపడే రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నవారు బలహీనమైన ఇమ్యూనిటీ సిస్టమ్ ను కలిగి ఉంటారు.
రాజీపడే రోగ నిరోధక శక్తి ఎలాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడలేదు. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. అలాగే ఎన్నో రోగాలు సంక్రమించేలా చేస్తుంది. ఏదేమైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు నావెల్ కరోనా వైరస్ వంటి ప్రాణాంతక వైరస్ లతో పోరాడలేరు. కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు మాత్రం అప్రమత్తంగానే ఉండాలి.
కరోనా వైరస్ నుంచి మనల్ని సురక్షితంగా ఉంచేందుకు వాక్సినేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాక్సినేషన్ తీసుకున్నా.. కోవిడ్ ప్రమాదం రిస్క్ తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బూస్టర్ షాట్లు కూడా వైరస్ వ్యాప్తిని నిరోధించగలవని తేల్చి చెబుతున్నారు. బూస్టర్ షాట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, భవిష్యత్తులో అంటువ్యాధులతో పోరాడేందుకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది.
టీకాలు వేసుకున్న వారు కూడా కోవిడ్ బారిన పడ్డవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటప్పుడే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కాగా ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.
జామా ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రాజీపడే రోగ నిరోధక శక్తి వ్యక్తులు, రోగ నిరోధక శక్తి లేని వ్యక్తుల కంటే వ్యాక్సినేషన్ తర్వాతే కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
టీకాలు వేసుకున్న వారైనా వేసుకోని వారైనా సరే.. అత్యవసరమైతేనే బయటకు రావాలి. ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే వారు శ్వాసకోశ అస్వస్థత సంకేతాలున్నవారికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ వ్యాయామాలు చేయాలి. వ్యాక్సిన్ తీసుకోకుంటే వెంటనే తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పరిశుభ్రతనుు పాటించాలి.