MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health Tips: బొప్పాయి పండును వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారంటే వీళ్ల పని అంతే..

Health Tips: బొప్పాయి పండును వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారంటే వీళ్ల పని అంతే..

Health Tips: బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గుతుంది. రుతుస్రావ సమస్యలు కూడా పోతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పండును మొత్తానికే తినకూడదు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2022, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు బహుళ పోషకాలతో నిండిన ఆహారాలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. పోషకాలు రకరకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలను రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆపిల్ పండ్లు, అరటిపండ్లు, ఖర్జూరాలు వంటి పండ్లతో పాటు ఉలవలు, వంకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను ఖచ్చితంగా తినాలి. వీటితో పాటుగా చాలా మంది బొప్పాయిని కూడా ప్రతిరోజూ తింటుంటారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిలోని అనేక పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

37

బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం ద్వారా కాలేయ ఆరోగ్యం బాగుండటమే కాకుండా.. రుతుస్రావం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే డెంగ్యూ వంటి వ్యాధులను కూడా బొప్పాయి నివారించడానికి సహాయపడుతుంది. బొప్పాయి పండే కాదు.. దాని గింజలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఉండే ప్రోటియోలైటిక్ మూలకం శరీరానికి హాని కలిగించే జీవులను నాశనం చేస్తుంది. ఇలాంటి బొప్పాయిని కొంతమంది మాత్రం తినకూడదు. తింటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. బొప్పాయిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.  
 

47
Papaya

Papaya

గర్భిణీ స్త్రీలు: 

బొప్పాయి పండు గర్బిణులు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే లేటెక్స్, పపైన్ అని పిలువబడే మూలకాలు గర్భాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది కడుపులోని బిడ్డ మరణానికి దారితీస్తుంది. అందుకే బొప్పాయి పండును గర్భిణులు అస్సలు తినకూడదు. 

57

 హార్ట్ పేషెంట్స్

గుండె జబ్బులతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే వివిధ మూలకాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీరు వీటి జోలికి వెళ్లకూడదు.

67

కిడ్నీల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లున్న వారు కూడా బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే విటమిన్ సి వీరి శరీరానికి హానిచేస్తుంది. కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి బొప్పాయికి దూరంగా ఉండండి.

77

హైపోగ్లైసీమియా 

హైపోగ్లైసీమియా ఉన్నవారు కూడా బొప్పాయి పండును అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినొచ్చు. కానీ హైపోగ్లైసీమియా ఉన్నవారు మాత్రం ఈ పండును తినకూడదు. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని మరింత తగ్గిస్తుంది. ఫలితంగా రోగులు ప్రమాదంలో పడతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved