- Home
- Life
- Toothache Problem: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది..!
Toothache Problem: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది..!
Toothache Problem: పంటిని నొప్పిని తగ్గించడంలో కొన్ని ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గా పాటిస్తే పంటి నొప్పి మళ్లీ ఎప్పుడూ రాదు..

పంటి నొప్పి సమస్యలను చాలా మందే ఫేస్ చేస్తున్నారు. కావిటీస్ (Cavities), క్యాల్షియం లోపం (Calcium deficiency), దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు (Bacterial infections) వంటి అనేక కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది తమంతట తాముగా మందులు తీసుకుంటారు. ఇది కొంతకాలం పాటు నొప్పిని తగ్గించినా.. మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మందులను ఎక్కువగా వేసుకుంటే మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది.
అందుకే పంటి నొప్పిని సహజ మార్గాల్లోనే వదిలించుకోవాలి. అయితే ఈ నొప్పిని తగ్గించడానికి సహాయపడే కొన్ని ఇంటి నివారణల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
లవంగం (Clove)
లవంగాలు (Clove) పంటి నొప్పికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పంటిని నొప్పిని తగ్గించడంలో లవంగాలను ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. లవంగాలను ఆయుర్వేద ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఇది పంటి నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పంటి సమస్య వారు రెండు మూడు లవంగాలను తీసుకుని పంటి కింద ఉంచి కొద్దిగా చూర్ణం చేస్తే.. నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.
ఇంగువ (Asphotida)
ఇంగువ పంటి నొప్పి తగ్గిండంలో ముందుంటుంది. ఇందుకోసం రెండు మూడు చిటికెడు ఇంగువలో రెండు నాలుగు చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి, ఆ పేస్ట్‌తో దంతాలను మర్దన చేయాలి. ఇలా చేస్తే కాసేపట్లోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
Rock salt
Rock salt మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పంటినొప్పికి ఇది సరైన నివారణ. పంటినొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో Rock salt ను వేసి ఆ తర్వాత ఆ నీటితో నోటిని కడగాలి. రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా నోటిలో వేసుకుని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉల్లిపాయ (Onion)
పంటి నొప్పిని తగ్గించడానికి ఉల్లిపాయ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయను ముక్కలుగా కోసి నొప్పిగా ఉన్న వైపు నుంచి నమిలితే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ రసం నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
వెల్లుల్లి, లవంగాలు
వెల్లుల్లి (Gerlic), లవంగాలు (Cloves) పంటి నొప్పిని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వెల్లుల్లి లవంగాలు తీసుకుని దాన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది. దీంతో దీర్ఘకాలంగా వేధించే పంటి సమస్యలు తగ్గిస్తాయి.
ఆవ నూనె, ఉప్పు
ఆవనూనె (Mustard oil) లో కొంచెం ఉప్పు (Salt) కలుపుకొని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయడంతో నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.