Onion Tips: ఈ టిప్స్ ఫాలో అయితే ఉల్లిపాయను కట్ చేస్తుంటే కన్నీళ్లు అసలేరావు..
Onion Tips: ఉల్లిపాయలు తరుగుతుంటే కామన్ గా కన్నీళ్లు వస్తుంటాయి. ఈ బాధతో చాలా మంది ఉల్లిపాయలు తరగాలంటేనే బయపడుతుంటారు. ఉల్లిపాయనుంచి వచ్చే ఆ ఘాటుకు కళ్ల నుంచి నీళ్లు, ముక్కు కారడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీరు గనుక ఈ టిప్స్ ను ఫాలో అయితే ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్లనుంచి నీళ్లు ముక్కుకారడం వంటివి ఏవీ ఉండవు.

Onion Tips: కూరలో ఏది ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఉల్లిపాయతోనే కూరకు మంచి రుచి వస్తుంది. కానీ ఈ ఉల్లిపాయ తరగడం మాత్రం కాస్త కష్టమైన విషయమే. కొంతమంది ఉల్లిపాయను తరగాలంటే బయపడుతుంటారు. కారణం.. దాని నుంచి వచ్చే ఘాటుకు కళ్లు మండటం, నీళ్లు కారడం, ముక్కు కారడం వంటి సమస్యలను వస్తాయని. ఈ బాధ ఉండకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
ఉల్లిపాయలను తరిగేముందు వాటిని కాసేపు వెనిగర్ లో ఉంచాలి. అలా ఉంచితే వాటిని కోసేటప్పుడు ఘాటు అంతగా రాదు. దాంతో కన్నీల్లు కూడా రావు. ఇలా లేదు అనుకుంటే ఉల్లిపాయలను రెండు లేదా మూడు గంటల ముందు ఫ్రిజ్ లో పెట్టాలి. అలా పెట్టిన ఉల్లిపాయలను కోసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయనలు తరిగేటప్పుడు వాటినుంచి రిలీజయ్యే ఘాటు తక్కువగా వస్తుంది. ఉల్లిగడ్డల్లో ఉండే ఎంజైమ్స్ తక్కువ పరిమాణంలో రిలీజ్ అవుతాయి. దానివల్లే కళ్లు మండవు, కన్నీళ్లు రావు.
ఉల్లిపాయలను తరిగేటప్పుడు కింది నుంచి కోయండి. పైభాగం నుంచి కాకుండా కింది భాగం నుంచి కోయడం వల్ల ఉల్లిగడ్డను తొందరగా తరుగుతారు. దీనివల్ల కూడా కన్నీళ్లు రావు.
Onion
నిమ్మకాయను ఉపయోగించండి: ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో నిమ్మకాయలు ఉంటున్నాయి. అయితే ఈ ఉల్లిపాయలను తరిగేటప్పుడు నిమ్మకాయను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కత్తికి కాస్త నిమ్మరసం అప్లై చేయండి. ఇలా చేస్తే ఉల్లిపాయనుంచి వచ్చే ఘాటు తగ్గుతుంది. దీనివల్ల మీరు కన్నీళ్లు పెట్టుకోవాల్సి అవసరం ఉండదు.
ఇవి కూడా.. ఉల్లిపాయలను తరిగేటప్పుడు దీపం లేదా కొవ్వొత్తిని వెలిగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే ఉల్లిగడ్డల నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ దీపం లేదా కొవ్వొత్తి వైపే వెళుతుంది. దీనివల్ల కూడా కన్నీళ్లు రావు.
మీకు తెలుసా.. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కాస్త రొట్టె ముక్కను నమలాలట. ఇలా చేస్తేకూడా కన్నీళ్లు రావట. అలాగే ఉల్లిపాయలను కాసేపు సూర్యకాంతిలో ఉంచి కట్ చేస్తే కూడా కన్నీళ్లు రావని కొందరు చెబుతున్నారు.