Onion Side Effects: ఉల్లిగడ్డను వీళ్లు అస్సలు తినకూడదు..
Onion Side Effects: షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే వాళ్లు ఉల్లిగడ్డను అస్సలు తినకూడదు. వీళ్లు ఉల్లిని తింటే షుగర్ మరింత తగ్గే ప్రమాదముంది.

Onion
ఉల్లిగడ్డలో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అందుకే ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదనే సామేత పుట్టుకొచ్చింది.
ఉల్లిగడ్డలేని కూర లేదంటే అతిశయోక్తి కాదేమో. వైద్య పరంగా ఉల్లి ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంది. అందుకే కొంతమంది ఉల్లిని పచ్చిగానే తింటుంటారు. ఎన్నో లాభాలను కలిగించే ఉల్లిపాయను కొంతమంది అస్సలు తినకూడదు.
షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే వ్యాధిని హైపో గ్లైసిమియా అంటారు. ఈ వ్యాధి బారిన పడ్డవారు ఉల్లిగడ్డను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఉల్లిగడ్డ వీరిలో షుగర్ లెవెల్స్ ను మరింత తగ్గిస్తుంది.
onion
ఇకపోతే విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉండే వాళ్లు కూడా ఉల్లిని తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అంతగా తినాలంటే చాలా తక్కువ మొత్తంలోనే తినాలని నిపుణులు సలహాలనిస్తున్నారు. వీరు ఉల్లిని ఎక్కువ తింటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందట. లేదా గుండె నొప్పి బారిన పడొచ్చంటున్నారు.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో బాధపడేవారు ఉల్లిని పూర్తిగా మానేయడమో లేకపోతే తక్కువగా తినడమో చేయాలని నిపుణులు. ఉల్లిలో ఉండే ఫ్రక్టోజ్ గ్యాస్ ప్రాబ్లమ్ ను మరింత పెంచుతుంది.
గుండెకు సంబంధించిన జబ్బులున్న వారు ఉల్లిగడ్డలను తినకపోవడమే మంచిదంటున్నారుు నిపుణులు. మొత్తానికి ఆరోగ్యకరమైన ఉల్లిగడ్డలను కూడా కొన్ని జబ్బులున్నవారు తినకూడదని తెలిసింది.