ముఖంపై ముడతలొచ్చాయా? వీటిని తినండి తగ్గిపోతాయి
వయసుతో పాటుగా మన చర్మం పై ముడతలు ఏర్పడటం చాలా సహజం. అయితే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను తింటే ఈ ముడతలు లేట్ గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

nuts for skin
చర్మం యవ్వనంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక నిర్ధిష్ట వయసు వచ్చిన తర్వాత చర్మంపై ముడతలు రావడం చాలా సహజం. అయితే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. కొన్ని ఆహారాలను తింటే ఈ ముడతలు అంత తొందరగా రావని నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కూడా ముడతలు పడదు. నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల గింజలు ఈ ముడతలను తగ్గిస్తాయి. అవేంటంటే..
వాల్ నట్స్
వాల్ నట్స్ పోషకాల భాండాగారం. వీటిని రోజూ గుప్పెడు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ గింజల్లో ఉండే విటమిన్ బి చర్మంపై ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
Image: Freepik
బాదం పప్పులు
రోజూ కొన్ని బాదం పప్పులను తింటే ఎన్నో పోషకలోపాలు తొలగిపోతాయి. బాదంలో ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
cashew
జీడిపప్పు
జీడిపప్పులోవిటమిన్ ఇ, సెలీనియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.
పిస్తా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పిస్తాపప్పు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి డయాబెటిస్ ను నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి.