రాత్రి భోజనం తర్వాత ఈ డ్రింక్ తాగితే.. మీరు బరువు తగ్గడం పక్కా
కొంతమంది బరువు తగ్గాలనుకుంటారు కానీ అందుకోసం ఏమీ చేయరు. కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గరు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత కొన్ని డ్రింక్స్ ను తాగితే మీరు తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
బరువు తగ్గాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ దీనిలో పడి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించడం మానేస్తారు. అవును ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు కూడా బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. మీరు గనుక రాత్రి భోజనం తర్వాత కొన్ని డ్రింక్స్ ను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మరసం, తేనె
సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు నిమ్మరసాన్ని ఎక్కువగా ఉదయం పరిగడుపున తాగుతుంటారు. కానీ దీన్ని రాత్రి తిన్న తర్వాత కూడా తాగొచ్చు. అప్పుడు తాగినా మీరు బరువు తగ్గుతారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
అలాగే తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మీ శరీర జీవక్రియ రేటును పెంచుతాయి. మీరు గనుక రాత్రి భోజనం తర్వాత నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు.
అల్లం టీ
అల్లంలో జింజెరోల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి బాగా సహాయపడుతుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత అల్లం టీ తాగడం వల్ల కూడా మీరు బరువు తగ్గుతారు. చిన్న అల్లం ముక్కను నీటిలో మరిగించి అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసాన్ని కలిపి తాగండి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ అల్లం టీ తాగితే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
తులసి టీ
తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.
తులసి టీ తయారు చేయడానికి తులసి ఆకులను తీసుకుని నీటిలో మరిగించండి. దీంట్లో కొద్దిగా తేనె లేదా నిమ్మరసాన్ని కలిపి రాత్రిపూట భోజనం చేసిన తాగండి. దీనివల్ల మీరు చాలా తక్కువ టైంలో బరువు తగ్గుతారు.
mint tea
పుదీనా టీ
పుదీనా మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే దీనితో తయారుచేసిన టీని తాగితే మాత్రం బెల్లీ ఫ్యాట్ చాలా సులువుగా కరుగుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు పుదీనా టీని తాగితే ఎసిడిటీ, గ్యాస్, వంటి జీర్ణ సమస్యలకు దూరంగా ఉంటారు. అలాగే బరువు కూడా తగ్గుతారు.
గ్రీన్ టీ
రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు గ్రీన్ టీ తాగినా బరువు తగ్గుతారు. గ్రీన్ టీని ఉదయాన్నే కాదు రాత్రిపూట కూడా ఎలాంటి భయం లేకుండా తాగొచ్చు. ఈ గ్రీన్ టీలో ఉండే కాటెచిన్ అనే సమ్మేళనం జీవక్రియను పెంచుతుంది.
దీన్ని తయారు చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గ్రీన్ టీని నీటిలో మరిగించి దాంట్లో తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగండి.