MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ రోజు నుంచే వీటిని వదిలేయండి.. అప్పుడే 2024 లో మీరనుకున్నది ఖచ్చితంగా చేస్తరు

ఈ రోజు నుంచే వీటిని వదిలేయండి.. అప్పుడే 2024 లో మీరనుకున్నది ఖచ్చితంగా చేస్తరు

New Year Resolution: వ్యక్తిత్వ వికాసం కోసం మనం కొన్ని విషయాలపై ఎక్కువ దృష్టిని పెట్టాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్లే ముందు వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడే కొన్ని అలవాట్లను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 27 2023, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

New Year Resolution :  మనలో చాలా మంది న్యూ ఇయర్ ప్రారంభానికి ముందే ఎన్నో వాగ్దానాలు చేస్తుటాం. మన జీవితాన్ని మెరుగ్గా ఉంచడానికి ఎన్నో తీర్మానాలు కూడా చేస్తుంటాం. కానీ వాగ్దానాలు, తీర్మానాలు మొదటినెలలోనే కనుమరుగవుతాయి. అసలు నేను ఈ పనులు చేయాలనుకున్నా అనే విషయాలను కూడా మర్చిపోతుంటాం. నిజానికి సంవత్సరం మనం చేసే కొన్ని వాగ్దానాలు చాలా సులువుగా ఉండటమే కాదు.. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వ్యక్తిత్వ వికాసం కోసం మనం కొత్త సంవత్సరంలో మనం చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

27


పనిని వాయిదా వేయడం

మనలో చాలా మందికి ఈ అలవాటు ఖచ్చితంగా ఉంటుది. ఇప్పుడు చేయాల్సిన పనిని తర్వాత చేద్దాంలే.. అని వాయిదా వేస్తూ ఉండటం మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఏ పనినైనా వాయిదా వేయడం వల్ల అది మన వ్యక్తిగత ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఈ అలవాటును అధిగమించడానికి జీవితంలో క్రమశిక్షణను తీసుకురండి. లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత పనిని విభజించండి. దీనివల్ల పనుల్లో ఆలస్యం అనేదే ఉండదు. అలాగే మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వల్ల మీలో సంతృప్తి భావన పెరుగుతుంది.
 

37
Image: Getty Images

Image: Getty Images

ఫెయిల్ అవుతాననే భయం

నిపుణుల ప్రకారం.. మీరు ఏదైనా పనిలో ఓటమి భయం నుంచి విముక్తి పొందితే.. కొత్త ప్రయత్నాలు అస్సలు వెనకాడరు. నిజానికి ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు పొరపాట్లు జరగడం చాలా సహజం. వైఫల్యం అభ్యాస ప్రక్రియలో ఒక భాగం మాత్రమే ఇది. మీకు తెలుసా? మనం తప్పుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. ఇవి మనం మరింత పట్టుదలతో ఉండటానికి, ముందుకు సాగడానికి సహాయపడతాయి. 

47

తప్పులను అంగీకరించకపోవడం

తప్పులు చేయడం చాలా కామన్. కానీ తెలిసి తప్పులు చేయకూడదు. అయితే మనలో చాలా మంది తప్పులు చేసినా.. వాటిని అస్సలు అంగీకరించరు. స్వీయ అవగాహనను పెంచుకుంటే.. మిమ్మల్ని మీరు సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మీ లోపాలను అర్థం చేసుకుంటారు. ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి ప్రయత్నాలు చేస్తే విజయం సాధిస్తారో తెలుసుకుంటారు. 
 

57

ఆలస్యంగా నిద్రలేవడం

మీరు రోజంతా చురుగ్గా ఉండటానికి, పనులను తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఉదయాన్నే నిద్రలేవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది నైట్ లేట్ గానే నిద్రపోతారు. దీని ప్రభావం వారి దినచర్య, పనివేళలపై కనిపిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ రోజును ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవచ్చు.
 

67

కంఫర్ట్ జోన్ లో ఉండటం

కంఫర్ట్ జోన్ నుంచి బయటపడకపోతే జీవితంలో పురోగతిని సాధించడం చాలా కష్టం. జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మీరు వ్యక్తిగతంగా ఎదగగలుగుతారు. అలాగే మీలో కొత్త ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. 

77

వ్యాయామం చేయకపోవడం

రెగ్యులర్ గా వ్యాయామం చేసే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ కొత్త సంవత్సరంలో ఇలా మాత్రం ఉండకండి. మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఉదయం వ్యాయామం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ శరీరంలో శక్తి స్థాయిని కూడా పెరుగుతుంది. స్టామిలాను పెంచే వ్యాయామాలు ఏదైనా నేర్చుకోవాలనే కోరికను కలిగిస్తాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sleep Study: హైబీపీ, డయాబెటిస్ రాకూడదంటే రాత్రినిద్ర ఎంతుండాలో చెప్పేసిన కొత్త స్టడీ
Recommended image2
Garlic Under Pillow: రాత్రి తలగడ కింద వెల్లుల్లి ఎందుకు పెట్టుకోవాలి?
Recommended image3
Gold Anklets: ధనవంతులు పెట్టుకునే బంగారు పట్టీల డిజైన్లను చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved