- Home
- Life
- Motivational story: జీవితం ఎవరిని, ఎప్పుడు, ఎలా మారుస్తుందో తెలియదు.. ఈ కథ చదివితే మీకో అర్థమవుతుంది.
Motivational story: జీవితం ఎవరిని, ఎప్పుడు, ఎలా మారుస్తుందో తెలియదు.. ఈ కథ చదివితే మీకో అర్థమవుతుంది.
మన పురుణాల్లో ఎన్నో నీతి కథలు ఉన్నాయి. మనిషి జీవితంలో ఎలా ఉండాలి.? ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథలు చెబుతుంటాయి. పురాణాల్లో ప్రస్థావించిన అలాంటి గొప్ప సందేశాన్ని అందించే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Motivation story
కొందరు డబ్బు, హోదా, పేరు ఉందని విర్రవిగుతుంటారు. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని, పేదవారిని నిందిస్తుంటారు. చులకన చేసి మాట్లాడుతుంటారు. అయితే ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దు, సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ఈ జీవిత సత్యాన్ని చెప్పే గొప్పే ఒక గొప్ప కథ మన పురాణాల్లో ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటో ఇప్పుడు చూద్దాం.
ఒకరోజు విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం ఆయన ధరించిన చెప్పులను చూసి హేలన చేస్తుంది. 'నువ్వెప్పుడు అలా పాదాల వద్ద ఉంటావు. నేను చూడు తలపై ఎంత ఠీవీగా ఉన్నాను. నన్ను అందరు చూస్తారు. నీకు అస్సలు మర్యాదే ఉండదు' అంటూ వెక్కిరిస్తుంది.
దీంతో పాదరక్షలు బాధపడుతుంటాయి. మా బతుకు ఇంతేలే అంటూ మదనపడుతుంటాయి. అయితే ఇదంతా గమనించిన విష్ణుమూర్తి.. 'పాదరక్షల్లారా మీరేమి బాధపదకండి. నేను రామావతారం ఎత్తిన తర్వాత మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండ బెట్టేలా చేస్తానని' మాటిస్తాడు.
అన్నట్లుగానే రామాయణ సమయంలో రాముడు వనవాసం వెళ్లిన సమయంలో భరతుడు రాజుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అయితే అన్నపై ఉన్న గౌరవంతో భరతుడు రాముడి పాద రక్షాలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పాలిస్తాడు. ప్రతీ రోజూ ఆ పాద రక్షాలను నమస్కరిస్తుంటాడు. అయితే భరతుడు అలా నమస్కరించిన ప్రతీసారి అతని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచుకునేది. చెప్పులకు ఇంతటి మహర్ధశ వచ్చిందని కిరీటం బాధపడింది.
నీతి: ఎదుటి వ్యక్తి పరిస్థితిని, సంపదను, హోదాను చూసి అపహాస్యం చేయకూడదనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. కాలం ఎప్పుడు ఎవరినీ ఎక్కడ ఉంచుతుందో ఎవరికీ తెలియదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరి గొప్పదనం తెలుస్తుందనే సందేశాన్ని అందిస్తుందీ కథ.