MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఫ్రిజ్ పైన వీటిని అస్సలు పెట్టకూడదు

ఫ్రిజ్ పైన వీటిని అస్సలు పెట్టకూడదు

 ఫ్రిజ్ లోపల ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు? అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫ్రిజ్ పైన ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదో మాత్రం చాలా మందికి తెలియదు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 25 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడైతే ఫ్రిజ్ ను లగ్జరీ వస్తువుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే సాధారణ వస్తువుగా మారిపోయింది. ఎండాకాలం, చలికాలం అంటూ తేడా లేకుండా ఫ్రిజ్ ను రోజూ వాడుతుంటారు. నిజానికి ఫ్రిజ్ ప్రతి సీజన్ లో అవసరమే. ఎందుకంటే ఇది ఫుడ్ ను ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది.

ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఇదొక్కటే కాకుండా.. చాలా మందికి ఇదొక అలంకరణ వస్తువుగా కూడా మారింది. ఎలా అంటారేమో.. చాలా మంది ఫ్రిజ్ పైన ఎన్నో రకాల వస్తువులను పెట్టి డెకరేట్ చేస్తుంటారు. ఇది మీకు బాగా అనిపించొచ్చు. కానీ ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25


ఫ్రిజ్ పైన వేటిని పెట్టకూడదు?

కొన్ని మొక్కలను పెట్టొద్దు

ప్రతి ఒక్కరూ ఇంటిని మొక్కలతో అందంగా డెకరేట్ చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల మొక్కలను, చెట్లను ఉపయోగిస్తారు. నిజానికి మొక్కలు ఇంటిని సహజంగా అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే అదృష్టాన్ని ఆకర్షిస్తాయి కూడా. ఇందుకోసం చాలా మంది బాల్కనీ, వరండాలో, హాల్లోనే కాకుండా ఫ్రిజ్ పైన కూడా రకరకాల మొక్కల్ని పెడుతుంటారు. కానీ వెదురు వంటి కొన్ని రకాల మొక్కల్ని ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ విద్యుదయస్కాంత క్షేత్రం దాని నుంచి వెలువడే సానుకూల శక్తిని తొలగిస్తుంది. 

35

మందులను ఫ్రిజ్ పైన ఉంచొద్దు

ఇంట్లో ఎక్కడ పెట్టినా గుర్తుండవని మందులను, మందుల  సీసాలను చాలా మంది ఫ్రిజ్ పైన పెట్టేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ మీరు వాడే మందులపై చెడు ప్రభావాన్నిచూపుతుంది.  నిజానికి ఫ్రిజ్ లోపల నుంచి చల్లగా ఉంటుంది. అదే బయట వేడిగా ఉంటుంది. ఈ ఫ్రిజ్ వెచ్చదనం మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

45

చేపల అక్వేరియంను పెట్టొద్దు

చాలా మంది ఇంటిని అందంగా మార్చడానికి ఫిష్ అక్వేరియంను ఇంట్లో పెడుతుంటారు. కొంతమంది వీటిని ఫ్రిజ్ పైనే పెట్టేస్తుంటారు. కానీ ఇలా పెట్టడం చేపల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిజ్ లోని వేడి, విద్యుదయస్కాంత క్షేత్రం చేపల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా ఫ్రిజ్ పైన పెట్టిన అక్వేరియంలోని చేపలు తొందరగా చనిపోతాయి. అందుకే అక్వేరియాన్ని ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు. 

55

ట్రోఫీలు, అవార్డులు పెట్టొద్దు 

చాలా మంది ఫ్రిజ్ పైన ట్రోఫీలు, అవార్డులను పెడుతుంటారు. మీరు కూడా ఇలా చేస్తే వెంటనే దానిపైనుంచి తీసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇది అశుభం. వీటిని ఫ్రిజ్ పైన పెడితే మీ సక్సెస్ మీది కాకుండా పోతుంది.  వాస్తుతో పాటుగా లోహంతో చేసిన పెద్ద పెద్ద వస్తువులను ఫ్రిజ్ పైన పెడితే దానిలో అంతర్గత నష్టం జరుగుతుందట. అందుకే వీటిని ఫ్రిజ్ పైన పెట్టొద్దంటారు. 

ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టకూడదు

రేడియో, టోస్టర్, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఫ్రిజ్ పైన పెట్టకూడదు. మీరు గనుక ఈ చిన్న పొరపాటు చేస్తే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా తొందరగా పాడవుతాయి. నిజమేంటంటే? ఫ్రిజ్ కంప్రెసర్ నుంచి వచ్చే ప్రకంపనలు ఈ వస్తువుల అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. అందుకే వీటిని ఫ్రిజ్ పైన పెట్టకూడదని చెప్తారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Recommended image2
Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !
Recommended image3
Top 5 Places in Goa : గోవా వెళ్తున్నారా? ఈ 5 ప్లేసెస్ చూడకపోతే మీ ట్రిప్ వేస్టే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved