Health Tips: వేపాకు టీ తో ఈ సీజనల్ వ్యాధులు మటుమాయం..
Health Tips: వేపాకుల్లో యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలుంటాయి. ఇవి గాయలను మాన్పడంతో పాటుగా ఎన్నో రకాల సీజనల్ వ్యాధులను తగ్గిస్తాయి. అంతేకాదు రక్తం నుంచి విషాన్ని బయటకు కూడా పంపుతాయి.

చిరు జల్లుల్ల రాక ఆహ్లాదంగా అనిపించినా.. ఇది ఎన్నో రోగాలను కూడా మోసుకొస్తుంది. చల్లని వాతావరణం వల్ల జలుబు, దగ్గు, పేగు ఇన్ఫెక్షన్స్, జ్వరం వంటి ఎన్నో రోగాలు చుట్టుకుంటాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేపాకులతో కూడా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
భారతదేశంలో శతాబ్దాల నుంచి వేపాకును సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీనిలో యాంటీ వైరల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలున్నాయి. ఇవి గాయాలను నయం చేస్తాయి. రక్తం నుంచి విషాన్ని బయటకు కూడా పంపుతాయి. అయితే సీజనల్ వ్యాధుల ముప్పు తప్పించుకునేందుకు వేపాకు టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
వేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ వైరల్ లక్షణాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
వేపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వేపను రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. పేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది. వేపాకు టీ తాగడం వల్ల పేగులు మరింత శుద్ధి పడతాయి. పేగులలో ఉండే చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
వేపాకు టీలో ఎక్కువ మొత్తంలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ సమ్మేళనాలుంటాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. పేపాకు టీని రెగ్యులర్ గా తాగితే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
heart
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
వేపాకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గడం మొదలవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇది రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.
LIVER
కాలెయాన్ని బలోపేతం చేస్తుంది
వేపాకు టీ కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.