- Home
- Life
- Facepack: తక్షణ మెరుపు కోసం గోధుమ పిండిలో ఈ ఒక్క పదార్థాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి చాలు
Facepack: తక్షణ మెరుపు కోసం గోధుమ పిండిలో ఈ ఒక్క పదార్థాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి చాలు
ఏదైనా ఫంక్షన్‌కు వెళుతున్నప్పుడు అప్పటికప్పుడే ముఖానికి మెరుపు కావాల్సి వస్తుంది. అలా తక్షణ గ్లో పొందాలనుకుంటే గోధుమ పిండిని ఉపయోగించవచ్చు. గోధుమపిండిలో పచ్చిపాలు కలిపితే చాలు. చర్మం మెరిసిపోతుంది.

తక్షణ మెరుపు కోసం
అప్పటికప్పుడు ఏదైనా వేడుకకు వెళ్లాలనుకుంటే తక్షణమే చర్మానికి మెరుపు ఇచ్చే కాస్మొటిక్స్ ను వాడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే రసాయనాలు కలిపినా కాస్మోటిక్స్ ను ప్రతిరోజూ వాడడం ఆరోగ్యకరం కాదు. ఇంటి చిట్కాల ద్వారా కూడా తక్షణ మెరుపును పొందవచ్చు. ప్రతి అమ్మాయి తన చర్మం మెరిసిపోవాలని కోరుకోవడం సహజం. మీరు ఎలాంటి కాస్మొటిక్స్ వాడాల్సిన అవసరం లేకుండా, ఖరీదైన చికిత్సలు లేకుండా కేవలం గోధుమ పిండితోనే ముఖాన్ని మెరిపించుకోవచ్చు.
పచ్చిపాలు కలపండి
గోధుమ పిండిలో పచ్చి పాలను వేసి పేస్టులా కలపండి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు వదిలేయండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీకు తక్షణమే మెరుపు కనిపిస్తుంది. ఏదైనా ఈవెంట్లకు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ చిట్కాను పాటించండి. ఇది మీకు ఉత్తమంగా పనిచేస్తుంది. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ. ఇది హోమ్ మేడ్.. కాబట్టి ఎలాంటి రసాయనాలు కూడా ఉండవు.
మృత కణాలను తొలగిస్తుంది
పచ్చిపాలు, గోధుమపిండి కలిపి రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖంపై ఉన్న మృత కణాలను ఇవి తొలగిస్తాయి. వారానికి మూడు రోజులు పాటు ఇలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముఖంపై ఉన్న మురికి మొత్తం తొలగిపోతుంది.
మొటిమలు ఉన్న వారితో
చర్మం పొడి బారే సమస్యతో బాధపడే వారికి గోధుమపిండి, పచ్చిపాలతో కలిపి వేసే ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మొటిమల సమస్యతో బాధపడేవారు కూడా ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. కాబట్టి మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.
ప్రకాశవంతమైన చర్మం
చర్మాన్ని మెరిసేలా చేయడంలో గోధుమపిండి, పచ్చిపాలు రెండూ ముందుంటాయి. ఇది చర్మాన్ని తేమవంతంగా చేస్తాయి. అలాగే చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. తక్షణమే చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో పచ్చిపాలు గోధుమ రెండు, గోధుమపిండి అద్భుతంగా ఉపయోగపడతాయి.