ప్రతిరోజూ పాలు తాగితే ప్రమాదమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
పాలలో (Milk) అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే ప్రతిరోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని, బరువు పెరుగుతారని, త్వరగా జీర్ణం కావని కొందరు భావిస్తుంటారు. దీంతో వారు నిత్యం పాలు తీసుకోవడానికి సంకోచిస్తారు. అయితే వారిలోని సందేహాలకు డాక్టర్ల సలహామేరకు సరైన సమాధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలలో శరీరానికి కావలసిన క్యాల్షియం (Calcium) అనే పోషక పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పాలలో క్యాల్షియంతో పాటు విటమిన్ ఎ, బి, డిలు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక ప్రతి రోజు పాలను తీసుకుంటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి.
ఎదిగే పిల్లలకు పాలు మంచి పౌష్టిక ఆహారం (Nutritious food). అందుకే పాలను పోషకాల గని అని అంటారు. మనం రోజూ తీసుకునే ఒక గ్లాసు పాలలో 8 గ్రాముల ప్రోటీన్, 300 మిల్లీ గ్రాముల పొటాషియం (Potassium), క్యాల్షియం, విటమిన్ డి ఇతర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక నిత్యం పాలను తాగితే ఆరోగ్యానికి మంచిది.
వెన్న తీయని పాలలో కొవ్వు పదార్థాలు (Fatty substances) ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ పాలను తాగితే బరువు పెరుగుతారు. అయితే వెన్న తీసిన పాలలో ప్రొటీన్లు (Proteins) ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు వెన్నతీసిన పాలను తీసుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు నిత్యం పాలను తాగవచ్చు.
అయితే చిన్నపిల్లలలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక ఆవు పాలను తాగించాలి. యుక్త వయస్సులో ఉండే వారు టోన్డ్ మిల్క్ (Toned Milk), అదే పెద్ద వయసులో ఉండేవారు స్కిమ్మ్‌డ్ మిల్క్ (Skimmed Milk) తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పాలు, చేపలను ఒకేసారి తీసుకోవడం మంచిది కాదని అలా తీసుకుంటే చర్మంపై తెల్ల మచ్చలు వస్తాయని పెద్దలు చెబుతారు.
ఎందుకంటే పాలు ఆల్కలైన్ స్వభావాన్ని, చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ రెంటినీ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు (Gastric problems) ఏర్పడుతాయి. కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా పాలు త్వరగా జీర్ణం కావు. అయితే ఈ సమస్య అందరిలోనూ ఒకేలా ఉండదు. పాలలో అధిక మొత్తంలో ఉండే లాక్టోస్ (Lactose) అనే పదార్థం కారణంగా కొందరిలో పాలు త్వరగా జీర్ణం కావు.
milk general
ఈ కారణంగా వారిలో గ్యాస్, ఎసిడిటీ (Acidity) వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే లాక్టోస్ ఇన్‌టోలరెంట్ (Lactose intolerant) అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు పాలను తాగక పోవడమే మంచిది. మరి పాలు తాగని వారు క్యాల్షియం లభించడం కోసం ఇతర ప్రత్యామ్న్యాయ పదార్థాలను తీసుకోవడం మంచిది. లాక్టోస్ ఇన్‌టోలరెంట్ సమస్య లేనివారు నిర్భయంగా పాలను తాగవచ్చని ఎటువంటి ప్రమాదము కలగదని వైద్యులు చెబుతున్నారు.