MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • BlackMagic Capital: మన దేశంలో క్షుద్రపూజలకు కూడా ఒక రాజధాని ఉందా? ఊరిపేరు చెబితేనే వణికిపోతారు

BlackMagic Capital: మన దేశంలో క్షుద్రపూజలకు కూడా ఒక రాజధాని ఉందా? ఊరిపేరు చెబితేనే వణికిపోతారు

BlackMagic Capital:భారత దేశంలో ప్రత్యేకంగా క్షుద్రపూజలకు రాజధాని కూడా ఉందా? ఇక్కడ.. ఇంటికో మాంత్రికుడు ఉన్నాడా? వారంతా క్షుద్రపూజలు చేస్తారా? అలాంటి గ్రామం మన దేశంలోనే ఉందా? ఇది ఎక్కడ ఉంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 21 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బ్లాక్ మ్యాజిక్ రాజధాని..
Image Credit : AI Meta

బ్లాక్ మ్యాజిక్ రాజధాని..

చూడటానికి చాలా ప్రశాంతంగా ఉండే గ్రామం అది. బయటి నుంచి చూస్తే.. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఎంతో అందంగా కనపడుతుంది. కానీ, ఒకప్పుడు ఈ ఊరిపేరు చెబితేనే అందరూ భయంతో వణికిపోయేవారు. మనుషులను జంతువులుగా మార్చడం, గాల్లో తేలడం, శత్రు సైన్యాలను మాయం చేయడం.. ఇలా ఈ ఊరి గురించి ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతూ ఉంటారు. క్షుద్రపూజల విషయంలో ఈ గ్రామం పేరుగాంచింది. అదే.. అస్సాం రాష్ట్రంలోని మయాంగ్ గ్రామం. ఎవరూ అధికారికంగా ప్రకటించినప్పటికీ, జానపద కథలు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఈ మయాంగ్ ను ‘ ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్’ అని పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మయాంగ్ పేరు వెనక కథ..
Image Credit : Gemini

మయాంగ్ పేరు వెనక కథ..

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలోని, గౌహతి నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ మయాంగ్ గ్రామం ఉంది. మాయ అంటే భ్రమ లేదా మాయాజాలం.. దీని నుంచే మయాంగ్ అనే పేరు ఈ గ్రామానికి వచ్చింది. స్థానిక పురాణాల ప్రకారం, మహాభారతంలోని ఘటోత్కచుడు.. ఈ ప్రాంతానికి చెందిన వాడు అని..ఇక్కడే ఆయన మాయా విద్య నేర్చుకున్నాడని నమ్ముతారు.

33
ఈ గ్రామంలో జరిగిన వింతలు...
Image Credit : AI Meta

ఈ గ్రామంలో జరిగిన వింతలు...

ఈ గ్రామంలో జరిగిన వింతలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్వకాలంలో ఇక్కడి మాంత్రికులు తమ చేతిలోని మంత్రంతో మనుషులను జంతువులుగా మార్చేవారనే ప్రచారం ఉంది. అంతేకాదు, క్రీ.శ. 1337లో మహమ్మద్ షా అనే పాలకుడు దాదాపు లక్ష మంది బలమైన సైన్యంతో అస్సాంపై దండయాత్రకు వచ్చాడు. కానీ మయాంగ్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన ఆ సైన్యం ఒక్కసారిగా ఆనవాళ్లు లేకుండా మాయమైపోయిందని అస్సాం చారిత్రక కథనాలు చెబుతాయి. ఇదంతా ఇక్కడి మాంత్రికుల ప్రయోగాల వల్లే జరిగిందని నమ్ముతారు.

మంత్రాలతో వైద్యం.. 'మయాంగ్ సెంట్రల్ మ్యూజియం' 

ఇక్కడ కేవలం క్షుద్రపూజలే కాకుండా, ప్రాచీన ఆయుర్వేద మూలికలు, మంత్రాల కాంబినేషన్‌తో తీవ్రమైన రోగాలను కూడా నయం చేసేవారు. పాము కాటుకు గురైన వారిని కాపాడటం, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నవారి నొప్పిని క్షణాల్లో మాయం చేసేవారట. ఈ గ్రామం ప్రాచీన సంస్కృతిని కాపాడటానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మ్యూజియం కూడా ఉంది. ఇందులో ప్రాచీన మంత్ర శాస్త్ర తాళపత్ర గ్రంథాలు, క్షుద్రపూజలకు ఉపయోగించిన కత్తులు, బలిపీఠాల ఆయుధాలను ఇప్పటికీ ప్రదర్శనకు ఉంచారు.

ఇప్పటికీ అక్కడ క్షుద్రపూజలు చేస్తారా?

కాలక్రమేణా సైన్స్ అభివృద్ధి చెందడం, అక్షరాస్యత పెరగడంతో మయాంగ్‌లో క్షుద్రపూజల ప్రభావం చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు భయంతో ఎవ్వరూ అడుగుపెట్టడానికి సాహసించని ఈ గ్రామం, నేడు ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా మారింది. ఒకప్పుడు ప్రతి ఇంటికో మాంత్రికుడు ఉండేవాడు. కానీ, ఇప్పుడు అలా కాదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే.. ఇప్పటికీ ఆ వృత్తిని కొనసాగిస్తున్నారట. మిగిలిన ప్రజలు సామాన్య జీవితాన్నే గడుపుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Anklets: హెవీ డిజైన్ వెండి పట్టీలు.. పాదాలకు ఎంత అందమో!
Recommended image2
Butterfly Chicken: పండగ విందులో అదిరిపోయే చికెన్ స్టార్టర్..రెసిపీ చాలా సింపుల్
Recommended image3
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Related Stories
Recommended image1
Garlic Capital: వెల్లుల్లికి కేరాఫ్ అడ్రస్ ఇదే, ‘గార్లిక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
Recommended image2
Grey Hair: తెల్ల జుట్టు వచ్చేస్తోందా? ఈ ఒక్క ఆకు చాలు జుట్టు రాలడం తగ్గుతుంది, తెల్ల జుట్టు మాయం అవుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved