Lunar Eclipse 2022: తొలి చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అస్సలు కలిసి రాదు..
Lunar Eclipse 2022: ఈ ఏడాదిలో వచ్చే మొదటి చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Lunar Eclipse 2022: 2022లో బ్లడ్ మూన్ చంద్ర గ్రహణం మే 16, 2022న తెల్లవారుజామున 2:32 నుంచి 05:11 గంటల మధ్య యూకే వ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ గ్రహణం అని పిలువబడే గ్రహణం యొక్క మొదటి భాగం ఉదయం 2:32 గంటలకు ప్రారంభం కానుండగా.. పాక్షిక గ్రహణం అని పిలువబడే రెండవ భాగం ఉదయం 3:27 గంటలకు ప్రారంభమవుతుంది. తదుపరి లేదా చివరి భాగం పూర్తి గ్రహణం ఉదయం 4:29 గంటలకు ప్రారంభమవుతుంది.
మన దేశంలో చంద్రగ్రహణం ఈ మే 16 న చంద్రగ్రహణం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12: 20 గంటలకు ముగుస్తుంది. చంద్రుడు భూమి నీడ గుండా వెళ్లినప్పుడు.. ఈ ఖగోళ సంఘటన సంభవిస్తుంది.
Lunar Eclipse 2022
సూర్యుడు, భూమి, చంద్రుడు సమలేఖనంలో ఉన్నప్పుడు మరియు భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చినప్పుడు పౌర్ణమి రాత్రి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ఈ చంద్రగ్రహణం సమయంలో సూర్యుని నుంచి చంద్రుడు పొందే కాంతిని భూమి అడ్డుకుంటుంది. కాబట్టి చంద్రుడు తన ఏకైక కాంతి వనరును కోల్పోతాడు. దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రహణం కారణంగా చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
చంద్ర గ్రహణం టైమింగ్స్.. చంద్ర గ్రహణం 2022 మే 16న ఉదయం 08.59 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మే 16న ఉదయం 7.02 గంటలకు చంద్రుడు భూమి నీడ వెలుపలి భాగంలోకి ప్రవేశిస్తాడు. మధ్యాహ్నం 12.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. చంద్ర గ్రహణం 2022 యొక్క మొత్తం వ్యవధి 1 గంటా 25 నిమిషాలు.
ఈ చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య మరియు పశ్చిమ ఐరోపా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఇది భారతదేశం నుండి కనిపించదు. నాసా యొక్క లైవ్ స్ట్రీమ్ లో స్టార్గేజర్లు దీనిని చూడవచ్చు. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి, సుతక్ కాలం ఉండదు.
చంద్ర గ్రహణం రాశిచక్ర రాశులపై ప్రతికూల ప్రభావం.. ప్రతి గ్రహణం లాగే ఈ చంద్ర గ్రహణం కూడా 12 రాశుల వారిపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం ఈ రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంతకీ ఏయే రాశుల వారికి ఈ గ్రహణం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందో తెలుసుకుందాం.
మేషం.. ఈ చంద్రగ్రహణ సమయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో. ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ రాశీ వారు పెద్ద మొత్తంలో డబ్బులను కోల్పోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ డబ్బులను ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి లేదా రుణాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ సమయంలోనే మీరు రుణాలు తీసుకునే అవసరం ఎక్కువగా కలుగుతుంది.
కర్కాటకరాశి.. ఈ రాశి వారు ఈ చంద్రగ్రహణ సమయంలో డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తారు. తర్వాత ఎందుకు ఖర్చు చేసానా అని తర్వాత బాధపడతారు. అంతేకాదు ఇది మిమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమయంలో మీ పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ కారణంగా కూడా మీరు ఒత్తిడికి గురవుతారు.
కన్యారాశి.. కన్యారాశి వారికి ఈ చంద్రగ్రహణం కలిసి రాదు. ఇది వీరిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ ప్రత్యర్థులు మీకు హానీ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు నా అనుకున్న వారే వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా కూడా మీకు అనుకూలంగా ఉండదు. మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు.
వృశ్చిక రాశి.. ఈ రాశివారికి కూడా ఈ చంద్రగ్రహణం ఏమాత్రం సానుకూలంగా ఉండదు. ఈ గ్రహణం తర్వాత మీ భాగస్వామికి మీకు మధ్య సఖ్యత తగ్గుతుంది. గొడవలు కూడా జరగొచ్చు. అంతేకాదు ప్రతికూల ఆలోచనలతో మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారు. అవే మీ బంధాన్ని నాశనం చేస్తాయి. ఈ సమయంలో మీ భాగస్వామి మీరు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అరోగ్యం కూడా అంతగా బాగుండదు.
కుంభం.. ఈ రాశి వారు ఈ గ్రహణ సమయంలో తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ సమయంలో వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉండే అపరిశుభ్రత వల్ల మీరు అనారోగ్యం బారిన పడతారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.