Long Coronavirus symptoms: కొవిడ్ -19.. మహిళలకే రిస్క్ ఎక్కువ: తాజా అధ్యయనం..
Long Coronavirus symptoms: లాంగ్ కోవిడ్ ప్రమాదకరమైన గుండె జబ్బులతో సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఇది మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Coronavirus
Long Coronavirus symptoms: పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ దారుణంగా వ్యాపిస్తోంది. ఒకటిపోతే ఇంకోటన్నట్టు కొత్త కొత్త రూపాల్లో వస్తూ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ కోవిడ్ తగ్గినా లాంగ్ కోవిడ్ లక్షణాలు మాత్రం కొందరిలో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. పలు నివేధికల ప్రకారం.. 30 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నాకా ‘లాంగ్ కోవిడ్’ లక్షణాలతో బాధపడుతున్నారట.
కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ మహమ్మారికి సంబంధించిన స్మూక్ష వ్యాధి కణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంతోనే వీరిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు మగవారితో పోల్చితే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నెలవారీ Peer-reviewed Journal of Women's Health తాజా ఎడిషన్ లో ప్రచురింపబడిన ఒక నివేదిక ప్రకారం.. పురుషులతో పోల్చితే మహిళలే దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారట. తీవ్రమైన అలసట, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయట.
ఈ కోవిడ్ 19 పురుషులతో పోల్చితే మహిళలకే సంక్రమణ వ్యాప్తి, మరణాల అవకాశం తక్కువగా ఉన్నాయని గమనించినప్పటికీ.. తాజా అధ్యయనం ప్రకారం.. కోవిడ్ నుంచి రికవరీ అయిన తర్వాత దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో ఆడవారే ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారని తేలింది.
దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్న వారిలో 84 శాతం పురుషులు బాధితులుగా ఉంటే.. మహిళలలు 97 శాతం మరిన్ని రోగలక్షణాలను కలిగి ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. శ్వాస ఆడకపోవడం, బలహీనంగా అనిపించడం, ఛాతిలో నొప్పి, గుండె దడ, నిద్రరాకపోవడం వంటి సమస్యలు మహిళలల్లో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ కండరాల నొప్పులు, దగ్గు వంటి సమస్యలు వీరిలో కనిపించడం లేదట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మహిళల్లో నిద్రలేమి సమస్య మరింత ఎక్కువగా ఉందట. ఇకపోతే పురుషులు సంక్రమణ అనంతరం బరువును ఎక్కువగా తగ్గుతున్నారట.
ఈ కరోనా వైరస్ ఒకేసారి అనేక అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఆ కరోనా లక్షణాలు ఎప్పుడైనా కనిపించొచ్చు. ఇవి కొన్ని నెలలపాటు కూడా కొనసాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎవరు దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్నారు.. ఎవరు పడటం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ ఎంత కాలం ఉంటుంది.. కోవిడ్ సంక్రమణ తర్వాత 90 రోజుల తర్వాత కరోనా వైరస్ సంకేతాలు ఉంటే దాన్నే లాంగ్ కోవిడ్ అంటారు. అయితే ఈ లక్షణాలు తేలికపాటివిగా ఉంటే.. హాస్పటల్ లో చేరాల్సిన అవసరం ఉండదు. లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటే హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ సోకిన వారిలో 10 శాతం నుంచి మూడింట ఒక వంతు మంది దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్నారని డేటా సూచిస్తోంది. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు.. కరోనా నుంచి బయటపడ్డాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, శ్వాస ఆడకపోవడం, ఏకాగ్రత దెబ్బతినడం, నిద్రలేమి సమస్యతో బాధపడటం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.