liver damaged Signs: మీ లివర్ దెబ్బతిన్నది అని చెప్పే సంకేతాలివే..
liver damaged Signs: రకరకాల కారణాల వల్ల లివర్ దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భంలో మన శరీరం ఎన్నో సంకేతాలను చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తిస్తేనే మీ లివర్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఇతర అవయవాల మాదిరిగా కాలేయ ఆరోగ్యం (Liver health) కూడా చాలా ముఖ్యమైనది. శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో కాలేయం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కామెర్లు (Jaundice), ఫ్యాటీ లివర్ (Fatty liver), లివర్ సిర్రోసిస్ (Liver cirrhosis) అనేవి కాలేయాన్ని ప్రభావితం చేసే వ్యాధులు. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy foods),క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కాలేయాన్ని రక్షించగలవు. ముఖ్యంగా మీ జీవన శైలి బాగా లేనిప్పుడు, చెడు ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలెయ ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాలెయం దెబ్బతిన్నప్పుడు మీ శరీరం కొన్ని సంకేతాలను చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తిస్తేనే.. మీ కాలెయం ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. లేదంటే ఎన్నో సమస్యను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇంతకీ కాలెయం దెబ్బతిన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇపుుడు తెలుసుకుందాం..
eyes
చర్మం, కళ్లు పసుపురంగులో కనిపిస్తాయి
కళ్లు రంగు, చర్మ రంగు పసుపు పచ్చగా మారడం కాలెయం దెబ్బతిన్నది అనడానికి సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పాదాలలో వాపు
కాళ్ల వాపు వచ్చినా.. దీనివల్ల ఏమౌతుందని ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేసే వారు చాలా మందే ఉన్నారు. ఇలా చేస్తే.. ఏరి కోరి కష్టాలను కొనితెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే ఇది కాలెయ వైఫల్యానికి సంకేతం కాబ్టటి. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి.
మూత్రం రంగు మారుతుంది
నీళ్లు సరిగ్గా తాగపోయినా.. మూత్రం ముదురు రంగులో కనిపిస్తుంది. అలాగే కాలెయం దెబ్బతింటే కూడా మూత్రం ముదురు రంగులో ఆరోగ్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ మూత్రం రంగు ఇలా మారితే వెంటనే అప్రమత్తం అవ్వండి. వెంటనే డాక్టర్ ను సంప్రదించి టెస్ట్ చేయించుకోండి.
అలసిపోవడం
అలసట కూడా కాలెయ వైఫల్యానికి సంకేతం. ఏం పనిచేసినా.. చేయకపోయినా.. మీరు తరచుగా అలసటకు గురవుతున్నట్టైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఇది కాలెయం దెబ్బతిన్నది అని చెప్పే సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.