మీ చెవులను బట్టే మీరెలాంటి వారో చెప్పొయొచ్చు..! ఇంతకీ మీ చెవులు ఎలా ఉన్నాయి
సముద్రశాస్త్రం ప్రకారం.. మన అవయవాలు కూడా మన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తాయట. ఇందులో మన చెవుల ఆకారాన్ని బట్టి మనమెలాంటి వాళ్లలో తెలుసుకోవచ్చని చెప్తారు. ఎలాంటి చెవుల ఆకారం ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం పదండి.
మన శరీరం నుంచే మన విధి, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చని సముద్ర శాస్త్రంలో చెప్పబడింది. అయితే మీరు ఒక వ్యక్తి గురించి లేదా మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అతని అవయవాల ఆకృతి నుంచి అతను ఎలాంటివాడు, అతని ప్రవర్తనను తెలుసుకోవచ్చు. కాగా ఈ రోజు చెవుల ఆకారాన్ని బట్టి వారు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెద్ద చెవులు
కొందరి చెవులు పెద్దగా ఉంటాయి. ఇలాంటి చెవులున్న వారు జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా చాలా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అలాగే దేన్నీ అంత తేలిగ్గా వదులుకోరు. అదే వారిని ఇతరుల కంటే భిన్నంగా చేస్తుంది. వీరు ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తించబడతారు.
చిన్న చెవులు
చిన్న చెవులు ఉన్నవారు చాలా సిగ్గుపడతారు. కానీ వీళ్లకున్న ఈ స్వభావం కొన్నిసార్లు వీరిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే వీళ్లు కుటుంబం, సన్నిహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాంటి వారు ఏకాంతంగా జీవించడానికి చాలా సృజనాత్మకంగా ఉంటారు.
అనుసంధానించబడిన చెవులు
చెవులు కనెక్ట్ అయిన వ్యక్తులు మానసికంగా శక్తివంతంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైన వారు. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు భావోద్వేగాల ప్రభావానికి గురికాకుండా తర్కం ఆధారంగా నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే తమ జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను అధిగమించి ముందుకు సాగుతారు.
గుండ్రని చెవులు
గుండ్రటి చెవులున్న వ్యక్తులు ఆకస్మికంగా, ఊహాత్మకంగా ఉంటారు. ఇలాంటి చెవులున్న వారు ఈ ప్రపంచాన్ని చాలా భిన్నంగా చూస్తారు. వీరి ఆలోచన విధానం, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వీళ్లు ఇతరుల కంటే మెరుగ్గా తమను తాము చూపించుకోగలుగుతారు. అంతేకాదు వీళ్లు తమ భావాలను వ్యక్తపరచడంలో ప్రతిష్టాత్మకంగా, నిర్భయంగా ఉంటారు.